• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్‌కు ముప్పు..! అందుకే మిషన్ శక్తి .. సమర్థించిన అమెరికా రక్షణ విభాగం

|

వాషింగ్టన్‌ : మిషన్‌ శక్తి పేరిట భారత్‌ ఏశాట్‌ ప్రయోగాన్ని అగ్రరాజ్యం మరోసారి సమర్థించింది. యాంటీ శాటిలైట్ వెపన్ (Anti-Satellite, ASAT) ప్రయోగానికి అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ నుంచి ఇంకోసారి మద్దతు లభించింది. భారత్ మిషన్ శక్తికి సంబంధించి సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నకు.. యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్ కు చెందిన కమాండర్ జనరల్ జాన్ ఈ హైటెన్ ధీటైన జవాబిచ్చారు.

అంతరిక్షం నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనతోనే.. భారత్ ఈ రకమైన యాంటీ శాటిలైట్ వెపన్ ప్రయోగం చేపట్టాల్సివచ్చిందని వివరించారు. ఎలాంటి విపత్కరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి ఆ దేశానికి ఉందని తెలియజెప్పడానికే ఈ ప్రయోగం చేపట్టిందని సమాధానం ఇచ్చారు.

పెంటగాన్ సపోర్ట్

పెంటగాన్ సపోర్ట్

భారత్ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌) ప్రయోగానికి అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ మరోసారి బాసటగా నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత నెల 27వ తేదీన మిషన్‌ శక్తి పేరిట భారత్‌ ఏశాట్‌ ప్రయోగం నిర్వహించింది. భూమి నుంచి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ ని తునాతునకలు చేసింది.

అలాంటి కెపాసిటీ ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. అదలావుంటే భారత్ యాంటీ శాటిలైట్ వెపన్ ప్రయోగంపై నాసా ఆందోళన వ్యక్తం చేసింది. ఏశాట్ శకలాల కారణంగా ఐఎస్‌ఎస్‌కు ముప్పు ఉందని వాదించింది. అయితే ఆ వాదనను తోసిపుచ్చిన భారత నిపుణులు త్వరలోనే శకలాలు అదృశ్యమవుతాయని స్పష్టం చేశారు. దాంతో భారత్ వాదనతో ఏకీభవిస్తూ పెంటగాన్‌ కూడా సమర్థించడం విశేషం.

 ఇంటర్నేషనల్ రూల్స్..!

ఇంటర్నేషనల్ రూల్స్..!

అంతరిక్ష శకలాలపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులు పలు అంశాలు ప్రస్తావించారు. ఆ క్రమంలో అంతరిక్షానికి సంబంధించిన వ్యవహారాలపై.. కొన్ని ఇంటర్నేషనల్ రూల్స్ ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు జాన్ ఈ హైటెన్. అదలావుంటే ఓ సెనేటర్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఏశాట్ లాంటి ప్రయోగాలు చేసుకుంటూ పోతే అంతరిక్షంలో శకలాల ముప్పు తీవ్రమవుతుందని అన్నారు.

భారత్‌కు ముప్పు..! అందుకే ఏశాట్

భారత్‌కు ముప్పు..! అందుకే ఏశాట్

స్పేస్ లో శకలాలు పెరిగిపోతున్నాయనే అంశాన్ని సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ సభ్యులు లెవనెత్తారు. 2009 లో యూఎస్ కు చెందిన యాక్టివ్ శాటిలైట్ ను రష్యాకు చెందిన నాన్ యాక్టివ్ శాటిలైట్ ఢీకొట్టిందని గుర్తుచేశారు. గతంలో చైనా చేపట్టిన ఓ ప్రయోగం తాలూకు అనేక వ్యర్థాలు వెలువడ్డాయన్నారు. అవి ఇంకా స్పేస్ లోని ఉన్నాయని వాపోయారు. ఇలాంటి ఘటనలతో అంతరిక్షంలో శకలాలు పెరిగిపోతాయనే ఆందోళన వ్యక్తం చేశారు.

ఆయా దేశాల సామర్థ్య నిరూపణకు ఏశాట్ లాంటి ప్రయోగాలు చేపడుతుంటే అంతరిక్షంలో లేని ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అవుతుందన్నారు. ఇలాంటి ప్రయోగాలతో వివిధ రకాల సమస్యలు తలెత్తి.. స్పేస్ ను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు. అదలావుంటే భారత్ కు ముప్పు పొంచి ఉందనే ఆందోళనతోనే ఏశాట్ ప్రయోగం చేపట్టిందని.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సమర్థించారు జాన్ ఈ హైటెన్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India is concerned about the "threats" it faces in space, the Pentagon has said, defending New Delhi for recently testing the anti-satellite or ASAT missile capabilities. On March 27, India achieved a historic feat by shooting down its own low-orbit satellite with a ground-to-space missile, making the country a space power.The test made India the fourth country in the world after the US, Russia and China to have ASAT capabilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more