వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్లోబల్ వార్మింగ్: ఉప్పు చల్లితే సరి, కానీ...

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్:కాలుష్యాన్ని నివారించేందుకుగాను ఆకాశంలో ఉప్పును వెదజల్లాలని శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకొన్నారు. భూమికి పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల ఎత్తులో ఉప్పును వెదజల్లాలని నిర్ణయించారు. వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని పారదోలేందుకు శాస్త్రవేత్తలు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

గ్లోబల్ వార్మింగ్ నుండి రక్షించడానికి శాస్త్రవేత్తలు ఈ నిర్ణయం తీసుకొన్నారు. క్లోరోప్లూరో కార్బన్ల మూలంగా ఓజోన్ పొరకు రంద్రాలు పడ్డాయి దీంతో అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడుతున్నాయి ఈ సమయంలో భూమిని గ్లోబల్ వార్మింగ్ నుండి రక్షించేందుకు ఉప్పు చల్లితే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.

Pepper skies with salt to slow global warming

ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు సౌర కుటుంబంలోని గ్రహలు, గ్రహ శకలాలపై అధ్యయం చేశారు. ఉప్పు ఆవిరి అంశం వారి దృష్టికి వచ్చింది. ఆయా గ్రహలు, గ్రహశకలాలపై ఉన్న ఉప్పు ఏరోసాల్స్, సూర్యరశ్మిని ప్రభావవంతంగా పరావర్తనం చెందిస్తున్నాయని గుర్తించారు.

భూమిపైకి ప్రసరించే సూర్య కిరణాల ప్రభావం తగ్గేలా ఉప్పు ఏరోసాల్స్‌ను ట్రోపోస్పియర్ పొర పై భాగంలో చల్లాలనే కొత్త ప్రతిపాదన వచ్చింది. ఇదొక ఆసక్తికరమైన ఆలోచనగా తెలిపారు. ట్రోపోస్పియర్‌కు పైన ఉఫ్పు అణువులను వదలడం వల్ల సూర్యరశ్మిని పరావర్తనం చెందించి, భూమిని వేడెక్కకుండా కాపాడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయంతో ఉన్నారు.

అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అసలు ఉప్పుతో ఓజోన్‌ పొరకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఉప్పులోని రసాయనాలు వాతావరణంలోని మార్పులకు కూడ కారణమయ్యే అవకాశం ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కాలుష్యాన్ని తగ్గించకపోతే ఓజోన్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే జరిగితే వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయంతో ఉన్నారు.

English summary
Faced with a planet that is on average 1.2C hotter than it was before the industrial revolution, scientists have been nothing if not ingenious.Ideas for slowing the pace of global warming include filling the oceans with iron filings, flying a giant mirror into space and lofting ice-spraying gondolas into the stratosphere on balloons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X