వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బేనజీర్ హత్యకు కారకుడు ఆమె భర్తే: ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టో హత్యపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేనజీర్ హత్యకు ఆమె భర్త అసిఫ్ అలీ జర్దారీయే బాధ్యుడని ఆరోపించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

స్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి బేనజీర్ భుట్టో హత్యపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేనజీర్ హత్యకు ఆమె భర్త అసిఫ్ అలీ జర్దారీయే బాధ్యుడని ఆరోపించారు.

బేనజీర్-జర్దారీల ముగ్గురు పిల్లలు, భుట్టో కుటుంబం, సింధ్ ప్రజలను ఉద్దేశించి ముషారఫ్ మాట్లాడుతూ భుట్టో కుటుంబం బాధలకు అసిఫ్ అలీ జర్దారీయే బాధ్యుడని తెలిపారు. బేనజీర్, ముర్తజా భుట్టోల మరణాల్లో జర్దారీ ప్రమేయం ఉందని ఆరోపించారు.

 Pervez Musharraf claims Asif Ali Zardari responsible for Benazir Bhutto’s killing

హత్య జరిగిన ప్రతిసారీ, దాని వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారన్నది చూడాలన్నారు. ఈ సంఘటనల సమయంలో తాను అధికారంలో ఉన్నందువల్ల తాను సర్వస్వం కోల్పోయినట్లు తెలిపారు.

హత్య జరగడంతో తన ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిందన్నారు. బేనజీర్ హత్య వల్ల అన్ని విధాలుగా ప్రయోజనం పొందిన వ్యక్తి ఒక్కరే ఉన్నారని, ఆ వ్యక్తి అసిఫ్ అలీ జర్దారీయేనని చెప్పారు. ఈ కేసులో ఇది తన విశ్లేషణ అని తెలిపారు.

జర్దారీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నారని, ఆ సమయంలో ఈ కేసు దర్యాప్తు గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆ కాలంలో దర్యాప్తు ఎందుకు చురుగ్గా జరగలేదని ముషారఫ్ నిలదీశారు. బేనజీర్ హత్యలో ఆయనకు ప్రమేయం ఉండటమే దీనికి కారణమన్నారు.
బైతుల్లా మెహసూద్, అతని వర్గీయులు ఈ హత్యకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు స్పష్టంగా చెబుతున్నాయని, బేనజీర్‌ను టార్గెట్ చేయమని వారికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అలా తాను చెప్పే అవకాశం లేదన్నారు. ఆ వర్గం తననను వ్యతిరేకించేదన్నారు. ఇది మ్యూచువల్ ఫీలింగ్ అన్నారు.

తనను చంపాలని ప్రయత్నించిన మెహసూద్ చనిపోవాలని తాను కోరుకున్నట్లు అందరికీ తెలుసునని ముషర్రఫ్ అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అదే కోరుకుందన్నారు. మరోవైపు జర్దారీకి అప్పటి ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో గొప్ప సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. జర్దారీ ఈ సంబంధాలను వినియోగించుకుని మెహసూద్‌ను, ఆయన వర్గాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చునన్నారు.

బేనజీర్ భుట్టోకు తగిన రక్షణ కల్పించలేదని తనపై ఆరోపణలు చేస్తున్నారని ముషర్రఫ్ అన్నారు. భద్రత కల్పించవలసిన బాధ్యత తనది కాదన్నారు. ఈ సందర్భంగా తన ప్రశ్న ఒకటేనని, బాంబు, బుల్లెట్ ప్రూఫ్ కారు పై భాగంలో ఖాళీని (తలుపు వంటిదానిని) ఏర్పాటు చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని అడిగారు.

కారులో సురక్షితంగా కూర్చున్న బేనజీర్‌ను ఎవరో పిలిచారని, కారు పై భాగంలోని ఈ ఖాళీ ప్రదేశం నుంచి బయటికి వచ్చి, ప్రజలకు చేతులు ఊపాలని అడిగారని చెప్పారు. బేనజీర్ భుట్టో ఎన్నికల ప్రచారం చేస్తూండగా, 2007 డిసెంబరు 27న హత్యకు గురైన సంగతి తెలిసిందే.

English summary
Pakistan’s former dictator Pervez Musharraf on Friday claimed that Asif Ali Zardari was responsible for the killing of his wife Benazir Bhutto, saying the former president gained the most from the assassination of the country’s first woman prime minister. The 54-year-old Pakistan Peoples Party (PPP) chief and a two-time prime minister was killed along with more than 20 people in a gun and bomb attack in Rawalpindi’s Liaquat Bagh during an election campaign rally on December 27, 2007. Former president and army chief Gen Musharraf, who was last month declared a fugitive by an anti-terrorism court which ordered seizure of his property in the Bhutto murder case, accused PPP co-chairman Zardari of “having the most to gain from Benazir Bhutto’s murder” in a video posted on his official Facebook page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X