వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెషావర్ కిరాతకం: భారత్‌పై లష్కరే చీఫ్ హఫీజ్ విషం, హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాహోర్: పెషావర్ పాఠశాల ఘటన పైన పాకిస్తాన్‌కు చెందిన కొందరు నేతలు, ఉగ్రవాదులు భారత్ పైన విషం కక్కుతున్నారు. పెషావర్ ఘటన నేపథ్యంలో యావత్ భారత దేశం చలించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి సామాన్యుడి వరకు అంతా సానుభూతి వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.

అయితే పాకిస్తాన్‌కు చెందిన వారు మాత్రం భారత్‌పై అక్కసు కక్కుతూనే ఉన్నారు. లష్కరేతోయిబా అధినేత హఫీజ్‌ సయీద్‌ భారత్‌పై విషం కక్కారు. పెషావర్‌ దాడి వెనుక భారత్‌ హస్తం ఉందని అతడు ఆరోపించారు. ప్రతికార దాడులు తీర్చుకుంటామని ముంబాయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్‌ సయీద్‌ బహిరంగంగానే హెచ్చరించారు.

Peshawar attack scares the hell out of likes of Hafiz Saeed

అమెరికాకు సాయంగా భారత్‌ ఆఫ్ఘనిస్తాన్‌కు బలగాలను పంపితే కాశ్మీర్‌ విముక్తికి ముజాహిద్దీన్‌లను పంపుతామని ఆయన అన్నాడు. 2008లో ముంబైపై జరిగిన ఉగ్ర దాడికి వ్యూహం పన్నిన హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ఉంది. ముషారఫ్ కూడా భారత్ పైన మండిపడ్డ విషయం తెలిసిందే.

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పెషావర్‌లో జరిగిన దాడికి భారత్‌ కారణమని ఆయన ఆరోపించారు. 133 మంది చిన్నారులు, 9 మంది స్కూల్‌ సిబ్బందిని బలిగొన్న తాలిబన్లకు భారత్‌ నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ రా శిక్షణ ఇచ్చిందటూ ఆరోపించాడు.

Peshawar attack scares the hell out of likes of Hafiz Saeed

తెహ్రిక్‌ ఎ తాలిబన్‌ పాకిస్తాన్‌ కమాండర్‌ మౌలానా ఫజుల్లా అతను ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండేవాడు. ఫజుల్లాకు గత ఖర్జయ్‌ ప్రభుత్వం భారత్‌ నిఘా సంస్థ రా పాక్‌లో దాడులు చేసేందుకు సహకారం అందించినట్లు తన వద్ద విశ్వాసనీయ సమాచారం ఉందని సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషార్రఫ్‌ ఆరోపించాడు.

English summary
The bodies of the slain children in Peshawar’s Taliban attack had barely gone cold when many of the regressive voices in Pakistan started pointing fingers at India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X