వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్ : మానవాళికి ఊసరవెల్లి సందేశం.. వైరల్ వీడియో...

|
Google Oneindia TeluguNews

అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. కరోనా ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. వైరస్ నివారణకు వ్యాక్సిన్ లేకపోవడంతో కేసుల సంఖ్యను అదుపు చేయడం అన్ని దేశాలకు సవాల్‌గా మారింది. చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తూ.. స్వీయ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు తమకు తోచిన రీతిలో పరిశుభ్రతపై వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఊసరవెల్లి సైతం పరిశుభ్రతపై ప్రజలకు సందేశమిస్తోంది.

ఊసరవెల్లి హ్యాండ్ వాష్

ఊసరవెల్లి హ్యాండ్ వాష్

అమెరికాలోని కెంటకీ పరిధిలో ఉన్న హోప్కిన్స్‌విల్లేకి ఎలిజబెత్ పొయ్ అనే వ్యక్తి ఏడాది వయసున్న జిక్ అనే ఊసరవెల్లిని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కష్టకాలంలో ఉండటంతో.. ఆ ఊసరవెల్లితో అతనో సందేశాత్మక వీడియో రూపొందించాడు. ఊసరవెల్లిని తన అరచేతిలో పెట్టుకుని కిచెన్ సింక్ వద్దకు తీసుకెళ్లి ట్యాప్ ఆన్ చేశాడు. ట్యాప్ నుంచి నీళ్లు రావడంతో.. ఆ ఊసరవెల్లి తన రెండు చేతులను పైకి లేపి నీటితో వాష్ చేసుకోవడం అందులో కనిపించవచ్చు.

నిజంగా అది హ్యాండ్స్ వాష్ చేసుకుందా..

నిజంగా అది హ్యాండ్స్ వాష్ చేసుకుందా..

నిజానికి అక్కడ ఊసరవెల్లి చేతులను వాష్ చేసుకోలేదు. సాధారణంగా ఏ వస్తువుపైనైనా ఎక్కేందుకు ప్రయత్నించడం దాని సహజ లక్షణం. ఇదే క్రమంలో అది నీటి ధారను వస్తువులా భావించి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అలా రెండు చేతులు పైకి లేపి ఆ ప్రయత్నం చేయడంతో.. చూసేవాళ్లకు మాత్రం అది హ్యాండ్ వాష్ చేసుకున్నట్టే కనిపిస్తోంది. అయితే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పరిశుభ్రతకు ఉన్న ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు.. ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఎలిజబెత్ తెలిపాడు. మార్చి 22న ఈ వీడియోను రూపొందించాడు. సోషల్ మీడియాలో ఇప్పుడిది వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలు..

సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం రూపొందించిన ఈ వీడియోలు కరోనా పుణ్యమాని మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. ఎంతమంది చెప్పినా వ్యక్తిగత పరిశుభ్రత గురించి పట్టించుకోనివాళ్లు కనీసం ఈ ఊసరవెల్లులను చూసైనా నేర్చుకోవాలని కొంతమంది హితవు పలుకుతున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12లక్షల పైచిలుకు కేసులు నమోదు కాగా, దాదాపు 65 వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇండియాలో ఇప్పటివరకు 3,588 కేసులు నమోదవగా 99 మంది మృత్యువాతపడ్డారు.

English summary
A pet chameleon demonstrates how to wash hands during the COVID-19 pandemic. The one-year-old lizard named Zeke from Hopkinsville, Kentucky, loves putting his little reptilian fingers into the stream of water from the tap. His owner Elizabeth Poe used the colourful panther chameleon's adorable habit of trying to climb up the water to demonstrate how people can wash their hands to stop the spread of the coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X