వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ పెట్రో ధర తక్కువే.. రూ.70 పెట్రోల్, రూ.59 డీజిల్.. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

పెట్రోల్ ధరలు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో ధర పెంపుతో వాహనాలు బయటకు తీయాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.54కు చేరింది. డీజిల్ కూడా రూ. 88.69కు చేరింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పెట్రో ధరలు తక్కువగా ఉంటే కొనుగోలు చేయాలని చూస్తుంటాం.. అలా కొందరు క్యూ కడుతున్నారు. పెట్రోల్ కోసం నేపాల్‌కు క్యూ కడుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 70, డీజిల్ రూ. 59 మాత్రమే ఉంది. అందుకోసమే సరిహద్దు దేశం నేపాల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. సరిహద్దు ప్రాంతంలో ఉండే గ్రామస్తులు అక్కడకు వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు.

petrol, deisel price low in nepal

దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100కు దగ్గరలో ఉంది. డీజిల్ రూ. 90 వద్ద ఉంది. ఇది ప్రతి వాహనదారుడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నేపాల్ కరెన్సీ భారత్ రూపాయితో పోల్చుకుంటే లీటరు పెట్రోల్ రూ. 70, డీజిల్ రూ. 59గా ఉంది. ఈ విషయం నేపాల్ ఆయిల్ కార్పొరేషన్‌కు తెలియడంతో కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. బ్లాక్ మార్కెట్ జరక్కుండా నేపాల్ అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది.

English summary
petrol, deisel price low in nepal. litre petrol rs. 70, diesel rs.59.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X