వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ పైపైకి.. జల్లుమంటున్న సామాన్యుడి గుండె

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దీంతో చమురు ధరలను పెంచాలని ఆయిల్ గ్యాస్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) విజ్ఞప్తి మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా లీటర్ పెట్రోల్‌పై రూపాయి, రెండు రూపాయలు పెంచుతారు. కానీ పాకిస్థాన్ సర్కార్ వాహనదారులకు దిమ్మతిరిగే డిసిషన్ తీసుకున్నది.

ఓజీఆర్ఏ అభ్యర్థన మేరుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారు. దేశం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొవడంతో భారీగా ధరలను పెంచారు. ఓజీఆర్ఏ సూచన మేరకు లీటర్ పెట్రోల్‌పై రూ.5.15 పెంచారు. డీజిల్‌పై రూ5.65 పెంచినట్టు పాకిస్థాన్ పీఎంవో కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. దీంలో పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.117.83 కాగా డీజిల్ ధర రూ.132.47కి చేరిందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.

petrol diesel rates are high in pakistan

పెట్రో, డీజిల్ ధరలతోపాటు కిరోసిన్, లైట్ డీజిల్ ధరలు కూడా రూ.5.38, రూ.8.90 మేర పెంచినట్టు తెలిపాయి. దీంతో లీటర్ కిరోసిన్ ధర రూ.132.47కి చేరుకుంది. ఇక లైటి డీజిల్ ధర రూ.103.84కి చేరింది. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని పేర్కొన్నారు. తమపై పెట్రో గుది బండ మోపారని మండిపడ్డారు.

English summary
Pakistan faces financial difficulties. The government of Pakistan has decided to increase the prices of petrol and diesel at the request of the Oil Gas Development Authority (OGRA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X