వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాతో భారత్ డీల్: 5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఒప్పందం

|
Google Oneindia TeluguNews

హూస్టన్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 16 ఆయిల్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శనివారం మోడీ హూస్టన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది.

యూఎస్ నాచురల్ గ్యాస్ కంపెనీ టెల్లూరియన్(అమెరికా)-పెట్రోనెట్(భారత్) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాదికి 5 మిలియన్ టన్నుల సహజవాయువు కొనుగోలుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు.

Petronet signs MoU for up to 5 million tonnes of LNG with US firm Tellurian

కాగా, ఒప్పందం గురించిన లావాదేవీలు 2020 మార్చి 31 నాటికి తేలనున్నాయి. వీరితో సమావేశం ఫలవంతమైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, హౌడీ మోడీ కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొననున్న విషయం తెలిసిందే.

అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తుండటం గమనార్హం. ఇద్దరు దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు.

English summary
US natural gas company Tellurian Inc. and Petronet LNG Limited (PLL) of India have signed an MoU, under which PLL and its affiliates intend to import up to five million tonnes per annum (5 mtpa) of liquefied natural gas (LNG) from America, the two companies announced on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X