వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొవిడ్-19 వ్యాక్సిన్: చివరి ట్రయల్స్‌లో 95 శాతం సత్ఫలితాలు: ఫైజర్ ఫార్మా ప్రకటన

|
Google Oneindia TeluguNews

కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్దిలో ఫ్రంట్ రన్నర్ గా కొనసాగుతోన్న అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ.. మరో గుడ్ న్యూస్ వెల్లడించింది. జర్మనీకి చెందిన బయోన్‌టెక్‌తో కలిసి ఫైజర్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌‌కు సంబంధించి చివరిదైన ఫేజ్-3 క్లినికల్ ట్రంయల్స్ లో అద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయని తెలిపింది. తుది ప్రయోగాత్మక దశలో తమ వ్యాక్సిన్ 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు బుధవారం ప్రకటన చేసింది.

కరోనా పాజిటివ్‌గా తేలిన 170 మంది రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించామని, వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత 95 శాతం సత్ఫలితాలు కనిపించినట్లుగా ఫైజర్ సంస్థ పేర్కొంది. మరికొద్ది రోజుల్లో.. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ), ఎమర్జన్సీ యూజ్ ఆథరైజేషన్(ఈయూఏ)ను సంప్రదించి ఆమోదం కోసం ప్రతిపాదన పంపనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే..

ఫైజర్ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ ను అమెరికాలో అత్యవసర కేసులకు వాడాలనే ప్రతిపాదన దాదాపు అంగీకార దశకురాగా, భారత్‌లో మాత్రం దీని వినియోగం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే, ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచే వాతావరణ పరిస్థితులు భారత్‌లో లేవు. ఫైజర్ వ్యాక్సిన్‌ను -70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలన్న వార్తే ఇందుకు కారణం.

జగన్‌-చంద్రబాబుకు చెక్: 2024కంటే ముందే జమిలి ఎన్నికలు -జనసేనదే అధికారం: పవన్ కల్యాణ్జగన్‌-చంద్రబాబుకు చెక్: 2024కంటే ముందే జమిలి ఎన్నికలు -జనసేనదే అధికారం: పవన్ కల్యాణ్

భారత్ మాత్రమే కాదు సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న చాలా దేశాలు ప్రస్తుతం -70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్‌ను నిల్వ చేయాలన్న ప్రచారంతో ఫైజర్ వ్యాక్సి‌న్‌ను కొనాలా..? వద్దా..? అనే సందిగ్ధంలో ఉన్నాయి. దీనిపై.. నీతి ఆయోగ్ సభ్యులు, కోవిడ్-19పై ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

 Pfizer says its Covid vaccine is 95% effective in final trials

భారత్‌లో ఉన్న జనాభాకు సరిపడా వ్యాక్సిన్ లభించకపోవచ్చని.. అయితే ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రత్యామ్నయ మార్గాలను కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని.. ఫైజర్ వ్యాక్సిన్‌కు రెగ్యులేటరీ ఆమోదం లభించిన తర్వాత ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు.

పిడికిలి బిగించిన సాయిరెడ్డి -సలాం కొట్టిన సవాంగ్ -'తెలుగు వీరుడా..'వందనమంటూ ఏపీ గీతంపిడికిలి బిగించిన సాయిరెడ్డి -సలాం కొట్టిన సవాంగ్ -'తెలుగు వీరుడా..'వందనమంటూ ఏపీ గీతం

English summary
Global drugmakers Pfizer and BioNTech said on Wednesday their COVID-19 vaccine candidate is 95 per cent effective, including in adults over 65 years of age, a major announcement coming just two days after Moderna said its virus vaccine has an efficacy rate of 94.5 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X