• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొవిడ్-19 వ్యాక్సిన్: మరో 10 రోజుల్లో -‘ఎమ‌ర్జెన్సీ యూజ్’ కోసం ఫైజర్ అభ్యర్థన -ఎఫ్‌డీఏ ఓకే చెప్పేనా?

|

ఏడాది కాలంగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 50కిపైగా దేశాల ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చగా, భారత్ సహా మరో 50 దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తేలా చేసింది. శుక్రవారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6కోట్లకు, మరణాల సంఖ్య 14 లక్షలకు చేరువైంది. వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడం కలకలం రేపింది. ఈ విపత్కర పరిస్థితిలో అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఫైజర్ ప్రయత్నాలు ఫలిస్తే డిసెంబర్ లోనే సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది..

బీజేపీతో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్ -రాష్ట్ర నేతలకు చుక్కలు -కేంద్రంతోనే డీల్ -గ్రేటర్‌లాగే తిరుపతిలోనూ

 ‘ఎమ‌ర్జెన్సీ యూజ్' ట్యాగ్ కోసం..

‘ఎమ‌ర్జెన్సీ యూజ్' ట్యాగ్ కోసం..

కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ఫ్రంట్ రన్నర్ గా నిలిచిన ఫైజర్ ఫార్మా.. జర్మనీకి చెందిన బయోన్‌టెక్‌తో కలిసి తాను అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. తుది దశ క్లినికల్ ట్రయల్స్ లోనూ 95 శాతం ప్రభావవంతంగా పని చేసిందని ఇదివరకే ప్రకటించింది. తర్వాతి అడుగులో భాగంగా.. సదరు టీకాకు ‘ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్' హోదా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ‘ఎమ‌ర్జెన్సీ యూజ్' ట్యాగ్ కోసం అమెరికాసహా యూరప్ లోని వివిధ దేశాల ప్ర‌భుత్వాలను అభ్యర్థించినట్లు ఫైజర్ సంస్థ శుక్రవారం వెల్లడించింది.

 ఎఫ్‌డీఏ ఓకే అంటే..

ఎఫ్‌డీఏ ఓకే అంటే..

చివరిదైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో త‌మ టీకా 95 శాతం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోంద‌ని గ‌త బుధ‌వారం తెలిపిన ఫైజ‌ర్ సంస్థ.. అమెరికాలో ఎమ‌ర్జెన్సీ వాడ‌కానికి అనుమ‌తించాల‌ని కోరింది. ఈ మేరకు అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్‌డీఏ)కు అర్జీ పెట్టుకుంది. నిజంగా ఫైజర్ చెబుతున్నట్లు అది తయారు చేసిన టీకా ఎమ‌ర్జెన్సీ వ్యాక్సినేష‌న్‌గా వాడుకునే సామర్థ్యం ఉందా, ఆ మేరకు ఆధారాలున్నాయా అనే విషయాలను ఎఫ్‌డీఏ పరిశీలించనుంది. ఒకవేళ ఎఫ్‌డీఏ గనుక ఓకే చెబితే.. డిసెంబర్ నుంచే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ఫైజర్ ప్రతినిధులు తెలిపారు. యూఎస్ తోపాటు కాకుండా యూర‌ప్‌లోని యూకే సహా పలు దేశాల్లోనూ ‘ఎమ‌ర్జెన్సీ యూజ్' ట్యాగ్ కోసం ఫైజర్ ద‌ర‌ఖాస్తు చేసింది. కాగా,

బైడెన్ బృందంతోనూ చర్చలు..

బైడెన్ బృందంతోనూ చర్చలు..

అమెరికా ఎన్నికల్లో ఫలితాలు తేటతెల్లం అయినప్పటికీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓటమినీ అంగీకరించకపోవడం, రెండో టర్మ్ పాలనకు కూడా సిద్ధం అవుతుండటం, మరోవైపు ప్రెసిడెంట్ ఎలక్ట్ జోబైడెన్ తనదైన వ్యూహాలతో పరిపాలనా యంత్రాంగాన్ని సిద్దం చేసుకుంటుండటం గందరగోళానికి దారి తీసింది. ముఖ్యంగా కొవిడ్-19 వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన ఫైజర్ లాంటి ఫార్మా సంస్థలు.. తమ టీకాలకు అనుమతుల కోసం అటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తోపాటు ఇటు బైడెన్ బృందాలతోనూ చర్చలు జరుపుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‍ అభివృద్ధి, సరఫరాలపై అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‍ ‘అధికార మార్పిడి (ట్రాన్సిషన్‍)' బృందంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని ఫైజర్ సంస్థ అధికార ప్రతినిధి షారన్‍ కేస్టీలో తెలిపారు. మరోవైపు..

 ఇండియాకు ఫైజ‌ర్ వ్యాక్సిన్?

ఇండియాకు ఫైజ‌ర్ వ్యాక్సిన్?

చివరిదైన మూడో దశ క్లినికల్స్ లోనూ సక్సెస్ అయిన ఫైజర్ ఫార్మా.. ఎమర్జెన్సీ యూజ్ కోసం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ లోనే వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా మొద‌ల‌వుతుందని తెలిపింది. అయితే ఫైజర్ టీకా అంద‌రికీ అందాలంటే మ‌రో మూడు, నాలుగు నెల‌లు పడుతుందని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇటు భారత్ లోనూ ఫైజ‌ర్ వ్యాక్సిన్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ ను మైన‌స్ 70 డిగ్రీల సెల్సియ‌స్ ద‌గ్గ‌ర స్టోర్ చేయాల్సి ఉండటంతో అది ఇండియాలాంటి చాలా దేశాల‌కు పెద్ద సవాలేనని, స్టోర్ చేసేలా కోల్డ్ చెయిన్స్‌ను ఏర్పాటు చేసే అంశాల‌ను ప‌రిశీలిస్తామని నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వీకే పాల్ వెల్లడించారు.

  COVID-19 Vaccine : కరోనా చికిత్సకు Remdesivir వాడొద్దని స్పష్టం చేసిన WHO..!

  జగన్‌కు సెగ గడ్డలా నిమ్మగడ్డ -కుక్క అనడం కొడాలి నాని తప్పుకాదు :ఎంపీ రఘురామ అనూహ్యం

  English summary
  Pfizer said Friday it is asking US regulators to allow emergency use of its COVID-19 vaccine, starting the clock on a process that could bring limited first shots as early as next month and eventually an end to the pandemic -- but not until after a long, hard winter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X