• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయట్లేదా?: టీకా వేయించుకున్న నర్సుకు కరోనా పాజిటివ్: అనారోగ్యం

|

వాషింగ్టన్: కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అమెరికా దిగ్గజ ఫార్మాసూటికల్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఫైజర్ వ్యాక్సిన్‌‌పై తొలిసారిగా అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపట్లేదనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్న ఓ హెల్త్‌కేర్ వర్కర్.. కరోనా వైరస్ బారిన పడ్డారు. అనారోగ్యానికి గురయ్యారు. అమెరికాలో జోరుగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న సమయంలో ఈ ఉదంతం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

కరోనా స్ట్రెయిన్ భయం: బ్రిటన్‌కు విమాన సర్వీసుల రద్దు పొడిగింపు: ఎప్పటిదాకా?

అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ.. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అమెరికా సాధారణ ప్రజల వినియోగానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా అక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. తొలిదశలో హెల్త్‌కేర్ వర్కర్లు, నర్సులు, డాక్టర్లతో పాటు 70 సంవత్సరాలకు పైగా వయస్సున్న వారికి వ్యాక్సిన్ ఇంజెక్షన్‌ను వేస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ అక్కడ కొనసాగుతోంది.

Pfizer vaccine: US Nurse tests positive for COVID19 shortly after getting vaccinated

ఇందులో భాగంగా శాన్‌డియాగోలోని ఆసుపత్రిలో మాథ్యూ డబ్ల్యూ అనే నర్సుకు ఈ నెల 18వ తేదీన ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. అనంరతం అయిదు రోజుల పాటు సాధారణంగానే ఉన్న ఆ నర్సు ఆరోగ్యం ఉన్నట్టుండి విషమించింది. అనారోగ్యానికి గురయ్యారు. చలి, కండరాల నొప్పి, తేలికపాటి జ్వరం బారిన పడ్డారు. మాథ్యూకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ పరిణామాన్ని ఇప్పటిదాకా ఊహించలేదని మాథ్యూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శాన్‌డియాగో ఆసుపత్రిలో క్వారంటైన్‌లో ఉంటున్నారు.

ఇప్పటిదాకా లక్షలాది మందికి ఫైజర్ వ్యాక్సిన్ వేశారని, ఈ తరహా కేసు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి అని ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఏ కారణం వల్ల మాథ్యూకు వైరస్ సోకిందనే విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. నర్స్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఒక్క ఘటనతో ఫైజర్ వ్యాక్సిన్‌పై పనితీరుపై అనుమానాలను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

English summary
A US nurse has tested positive for COVID-19 eight days after having received a Pfizer vaccine shot. Matthew W, who works as an ER nurse at two hospitals in San Diego, received the jab on December 18. Six days later, after working a shift in the COVID-19 unit, Matthew had chills, muscle pain and fatigue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X