• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాల్లోనే విమానం కిటికీల్లోంచి దూకేశారు -29 మంది సైనికులు, 2 పౌరులు మృతి -ఆ 17 మంది కాలి బూడిద?

|

ఆగ్నేయాసియాలోని ఫిలిప్పీన్స్ లో కనీవినీ ఎరుగని ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతున్నది. దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-130 విమానం రన్ వేపై దిగబోయి అదుపుతప్పి దూరంగా వెళ్లి కుప్పకూలిపోయింది. ప్రమాదానికి సంబందించి అధికారులు, స్థానిక మీడియా చెప్పిన వివరాలివి..

 రోజా ఇంట్లో రాగిసంగటి: కేసీఆర్ బలుపు మాటలు -34శాతానికి హరీశ్ తలూపలేదా? :రేవంత్ రెడ్డి ఆగ్రహం రోజా ఇంట్లో రాగిసంగటి: కేసీఆర్ బలుపు మాటలు -34శాతానికి హరీశ్ తలూపలేదా? :రేవంత్ రెడ్డి ఆగ్రహం

కిటికీల నుంచి దూకేశారు..

కిటికీల నుంచి దూకేశారు..


ఫిలిప్పీన్స్‌లోని సులు ప్రావిన్స్ పరిధిలోగల జోలో ద్వీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన మొత్తం 96 మంది జవాన్లు, సిబ్బందితో ప్రయాణించిన సి-130 విమానం.. జోలో ఎయిర్ బేస్ లో ల్యాండ్ కావాల్సి ఉండగా, అనూహ్య రీతిలో అదుపుతప్పి కుప్పకూలింది. విమానాన్ని రన్ వేపై దించడానికి పైలట్లు చేసిన ప్రయత్నాలు విఫమయ్యాయి. కనీసం తిరిగి పైకి కూడా లేవలేని స్థితిలో భూమికి కొద్ది ఎత్తులోనే విమానం దూసుకుపోయింది. ఇక కూలిపోవడం ఖాయమని అర్థం కాగానే, లోపలున్న సైనికులు కిటికీలు బద్దు కొట్టి విమానంలోకి కిందికి దూకారు. కానీ..

యూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలుయూపీ ముఖ్యమంత్రిగా అసదుద్దీన్ ఓవైసీ -బీఎస్ఎంతో కలిసి 100 సీట్లలో -యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

చరిత్రలోనే విషాదకర దుర్ఘటన

చరిత్రలోనే విషాదకర దుర్ఘటన

ఉగ్రవాదులతో పోరు కోసం ప్రత్యేకంగా సుశిక్షితులైన సైనిక బృందం ప్రయాణించిన విమానం జోలో ఎయిర్ బేస్ లో దిగాల్సిఉండగా, అదుపుతప్పి పక్కనున్న ఇళ్లకు సమీపంగా కుప్పకూలింది. ఒక్కసారిగా విమానం నేలను తాకడంతో పెద్ద శబ్దంతో విస్పోటనం సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్ముకుంది. నిమిషాల్లోనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేస్తూ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఫిలిప్పీన్స్ చరిత్రలోనే విషాదకర దుర్ఘటనగా అభివర్ణిస్తోన్న ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 50 మందిని మాత్రమే ప్రాణాలతో కాపాడగలిగారు. వాళ్లలో కిటీకీల నుంచి దూకేసిన వాళ్లు కూడా ఉన్నారు. మిగతా..

  Lockdown : India Plans To Bring Back Over 14,000 Stranded Indians In 64 flights | Oneindia Telugu
  ఆ 17 మంది కాలి బూడిదయ్యారా?

  ఆ 17 మంది కాలి బూడిదయ్యారా?


  జోలో ద్వీపంలో విమానం కుప్పకూలిన ఘటనలో ఇప్పటిదాకా 31 మరణాలను అధికారికంగా ధృవీకరించారు. చనిపోయినవారిలో 29 మంది ఎయిర్ ఫోర్స్ జవాన్లని, విమానం కూలిన సమయంలో కిందున్న ఇద్దరు పౌరులు కూడా చనిపోయారని అధికారులు తెలిపారు. కాగా, మరో 17 మంది జాడ ఇంకా తెలియరాలేదని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. అయితే, విమానం పేలినప్పుడు ఎగిసిపడిన భారీ మంటలు చాలాసేపటిదాకా కొనసాగాయని, ఆ తర్వాతగానీ ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేసిందని, బహుశా గల్లంతైన ఆ 17 మంది మంటల్లో కాలిబూడిదైపోయి ఉండొచ్చని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

  English summary
  A Philippines Air Force troop plane crashed and broke up in flames on a southern island on Sunday, killing 31 people after some jumped from the fuselage, security officials said, in the country's worst military air disaster in nearly 30 years. Plane crash kills at least 29 on board, 2 civilians on ground. C-130 aircraft carrying 96 passengers, Search ongoing for 17 unaccounted military personnel, 50 survivors being treated in hospital.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X