వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాను హత్యలు చేశానని స్వయంగా ప్రకటించిన అధ్యక్షుడు..

గతంలో తాను చేసిన హత్యలను స్వయంగా ఒప్పుకోకపోవడమే గాక అక్కడి ప్రజలను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్జీ ఆదేశిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

మనీలా: బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, న్యాయ విచారణ ద్వారానే దోషులకు శిక్ష పడేలా చేయాలని చెబుతాయి. కానీ ఆధునిక హిట్లర్ గా పేరుగాంచిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో వైఖరి ఇందుకు పూర్తిగా భిన్నం. గతంలో తాను చేసిన హత్యలను స్వయంగా ఒప్పుకోకపోవడమే గాక అక్కడి ప్రజలను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని ఆదేశిస్తున్నారు.

జూన్,2015లో ఫిలీప్పిన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రొడ్రిగోది ఇదే వైఖరి. హిట్లర్ 30లక్షల మంది యూదులను హతమార్చారని, తాను 30లక్షల మంది డ్రగ్ బానిసలను హతమార్చేందుకు ఆనందిస్తున్నాని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా జరిగిన ఓ పారిశ్రామిక సదస్సులో రొడ్రిగో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

 Philippines president Rodrigo Duterte says he personally killed criminals

'నా చేతులకు రక్తం అంటిన మాట నిజమే. మనుషుల్ని కాల్చి చంపాను, నేనే చంపగలిగినప్పుడు మీరెందుకు చంపలేరని పోలీసులను నిలదీసేందుకే చంపాను. నిర్భయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి, నేరస్తులను నిర్దాక్షిణ్యంగా చంపేయండని చెప్పడమే నా ఉద్దేశ్యం. నేను దవావో మేయర్ గా ఉన్నప్పుడు మోటారు బైక్ వేసుకుని వీధుల్లో తిరిగేవాన్ని. ఎక్కడ సమస్య ఉత్పన్నమవుతుందా అని చూసేవాన్ని. నేరస్తులను ఎన్ కౌంటర్ లో చంపేందుకు అవకాశం కోసం వెతికేవాడిని. ఓసారి ఓ అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు రేప్ చేసేందుకు కిడ్నాప్ చేస్తున్నారన్న అనుమానంతో వారి కాల్చి చంపేశాను'

ఈ మాటలన్ని ఫిలిప్పీన్ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్జీ నోటి నుంచి వచ్చినవే. దేశంలో డ్రగ్ మాఫియాపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించిన రొడ్రిగో.. ఇప్పటిదాకా 6వేల మందిని చట్ట విరుద్దంగా హత్య చేయించారు. రొడ్రిగో దవావో మేయర్ గా ఉన్న సమయంలో స్వయంగా ఓ యుజి సబ్ మెషిన్ గన్ తో ఓ న్యాయశాఖ ఏజెంట్ ను కాల్చి చంపాడని సెనేట్ విచారణ కమిటీ ముందు రొడ్రిగో హంతక ముఠా మాజీ సభ్యుడొకరు ఇటీవలనే వాంగ్మూలం ఇచ్చారు.

కాగా, ఇటీవలి ఫిలిప్పినో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రొడ్రిగో తాను హంతకుడిని కానని ప్రకటించారు. ఆ ప్రకటన చేసి కొన్ని రోజులు గడవక ముందే తాను స్వయంగా హత్యలు చేశానని ఆయన ప్రకటించడం గమనార్హం. రొడ్రిగో తీరుపై అక్కడి మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. రొడ్రిగో తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయనకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

English summary
Rodrigo Duterte has announced he personally killed suspected criminals when he was mayor of his home city of Davao in the Philippines, cruising the streets on a motorcycle and “looking for trouble”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X