వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"రేప్ విక్టిమ్ భలే అందగత్తే, నాకు ఛాన్స్ రాలేదే"

By Pratap
|
Google Oneindia TeluguNews

మనీలా: ఫిలిఫైన్స్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో ముందంజలో ఉన్న రోడ్రిగో డిగాంగ్ డుటెర్టేకు గతంలో తాను నోరు జారి చేసిన వ్యాఖ్యలు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఆ వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారాయి. 1989లో డవాయో సిటీకి డుటెర్టే మేయర్‌గా పనిచేశాడు.

ఆయన మేయర్‌గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన 36 ఏళ్ల మహిళ సిటీ జైలులో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై డుటెర్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహిళ సామూహిక అత్యాచారానికి గురికావడం పట్ల తాను చాలా కోపంగా ఉన్నానని ఆయన చెప్పాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పాడు.

"ఆమె చాలా అందంగా ఉంది ఆమెను అనుభవించే అవకాశం మొదట నాకువచ్చి ఉంటే బాగుండేది" అన్నాడు. ఆ అవకాశం చేజారిపోయిందని విచారం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ప్రత్యర్థులు యూట్యూబ్‌లో పెట్టారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 Philippines presidential candidate apologises for comments on Australian rape victim

అయితే తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పారు. వచ్చే మూడు వారాల్లో జరిగే ఎన్నికల్లో ఆ వ్యాఖ్యలు వ్యతిరేకంగా మారే అవకాశం ఉండడంతో ఆయన దిగి వచ్చి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.

క్షమాపణ చెప్పడానికి తొలుత ఆయన మొరాయించారు. మన మహిళలను అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని, కిరాతకమైన నేరాలకు బాధితులైనవారి పట్ల తనకు అగౌరవం లేదని చెప్పారు. కొన్ని సార్లు తన నోరు బాగుండాల్సిందని, తన జీవిత తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు.

English summary
A Filipino mayor who built a reputation for fighting crime has apologised for a rape comment that caused a political storm and could dent his chances of winning the presidency in an election three weeks away
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X