వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూకంపంతో విధ్వంసం, పలువురు గల్లంతు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

మనీలా: పిలిప్పైన్స్‌లో భారీ భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. మృతుల సంఖ్య బుధవారానికి 107కు చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని అంటున్నారు. శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ శవాలు బయటపడుతున్నాయి.

మంగళవారం బోహోల్ ప్రొవిన్స్‌ను తాకిన భూకంపం వల్ల 3 మిలియన్ల మందిని విషాద సముద్రంలో ముంచింది. మనీలాకు దక్షిణాన 640 కిలోమీటర్ల దూరంలో గల బోహోల్‌ ఇప్పుడు విషాద సాగరంగా దర్శనమిస్తోంది. ఇప్పటి వరకు పలువురి జాడ తెలియడం లేదు.

బోహోల్‌లో ఇప్పటి వరకు 97 మంది, సిబూ, సిక్విజోర్‌ల్లో 10 మంది మరణించినట్లు లెక్కలు తేలాయి. దాదాపు 276 మంది గాయపడ్డారు. బోహోల్, సిబూల్లో పలు భవంతులు నేలకూలాయి. శతాబ్దాలనాటి చర్చిలు కూడా నేలమట్టమయ్యాయి. ఆస్పత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనలు బీటలు వారాయి.

సిబూలో ఇలా..

సిబూలో ఇలా..

భూకంపం విధ్వంసం సృష్టించిన తర్వాత సిబూలోని బాసిలికా చర్చి వద్ద ఓ ప్రైవేట్ గార్డు ఇలా.. పిలిప్పైన్స్‌లోని అతి పురాతనమైన చర్చి బెల్ టవర్ కూలిపోయింది. భూకంపం తాకిడికి భవంతులు కూలిపోయాయి. రోడ్లు బీటలు వారాయి.

బోహోల్‌లో..

బోహోల్‌లో..

భూకంపం తాకిడికి బోహోల్ అతలాకుతలమైంది. లోబోక్ చర్చి భూకంపం తాకిడికి కూలింది. శిథిలాలను చూస్తున్న స్థానికులు. బోహోల్‌లో మరణాల సంఖ్య కూడా తీవ్రంగా ఉంది.

కూలిన నిర్మాణం..

కూలిన నిర్మాణం..

భూకంప తాకిడికి భవనాలు కూలుతుండడంతో ప్రజలు వడివడిగా పరుగులు తీస్తూ దూరం వెళ్లారు. భవనాల కప్పులు కూలాయి. భవనాలు శిథిలాలుగా మారాయి. భవనాల గోడలు బీటలు వారాయి. సిబూలో దృశ్యం ఇది.

నోరు తెరిచిన భూమి...

నోరు తెరిచిన భూమి...

రోడ్లు బీటలు వారి నోళ్లు తెరిచాయి. అటువంటి రోడ్ల మీద ప్రజలు భీతావహులవుతూ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. బోహోల్‌లోని ఓ రోడ్డు నోరు తెరిచిన దృశ్యం ఇది...

శిథిలాల తొలగింపు..

శిథిలాల తొలగింపు..

కార్లపై పడిన శిథిలాలను సైనికులు తొలగిస్తూ ఇలా కనిపించారు. మంగళవారంనాటి భూకంపం పిలిప్పైన్స్‌ను అతలాకుతలం చేసింది. సిబూలోని ఓ దృశ్యం ఇది..

క్షతగాత్రులు ఇలా...

క్షతగాత్రులు ఇలా...

సిబూ సిటీని భూకంపం తాకిన తర్వాత ఆస్పత్రిలోని రోగులు ఇలా బయట కనిపించారు. భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.

కార్లు విధ్వంసం..

కార్లు విధ్వంసం..

సిబూలోని జిఎంసి ప్లాజా భవనం వద్ద శిథిలాల కింద కార్లు కూరుకుపోయి ఇలా కనిపించింది. భూకంపంతో పలు భవనాలు కూలాయి. పలు భవనాల గోడలు బీటలు వారాయి. పైకప్పులు రాలి పడ్డాయి.

English summary

 Days after a strong 7.2 magnitude earthquake hit Philippines, the death toll has reached 107 on Wednesday even as emergency workers struggled to rescue an undetermined number of people buried in rubble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X