వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుఫాన్: ఫిలిఫ్పీన్స్‌లో 182 మంది మృతి, నిరాశ్రయులైన వేలాది మంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

మనీలా: తుపాన్ ప్రభావంతో దక్షిణ ఫిలిఫ్పీన్స్‌ అతలాకుతలమైంది. టెంబిన్ తుఫాన్ కారణంగా 182 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. టెంబిన్ తుఫాన్ ధాటికి దక్షిణ ఫిలిఫ్పీన్స్ తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాలతో ఫిలిఫ్పీన్స్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహయక చర్యలను చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఫిలిఫ్పిన్స్‌లో 182 మంది మృతి

ఫిలిఫ్పిన్స్‌లో 182 మంది మృతి

భారీ తుపాను ధాటికి దక్షిణ ఫిలిప్పీన్స్‌ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. టెంబిన్ తుఫాన్ ధాటికి 182 మంది ప్రాణాలు కోల్పోగా, వేల మంది నిరాశ్రయులయ్యారు. 153 మంది ఆచూకీ లేకుండా పోయింది.పెద్ద ఎత్తున మట్టి కొట్టుకొచ్చినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

హెచ్చరించినా పట్టించుకోలేదు

హెచ్చరించినా పట్టించుకోలేదు

తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని ప్రభుత్వం ముందే హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు.అందుకే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతి ఏటా 20 తుఫానులు

ప్రతి ఏటా 20 తుఫానులు

వాస్తవానికి ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కు పైగా పెను తుపానులు విరుచుకుపడుతుంటాయి. అయితే ఈ తుఫాన్ హెచ్చరికలను ప్రజలు సాధారణ తుఫాన్ మాదిరిగా భావించారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని ద్వీపాలకు జరిగే నష్టం తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోలేదని తెలుస్తోంది.

మెరుపు వరద

మెరుపు వరద


ఫిలిప్పీన్స్‌లో రెండో అతి పెద్ద ద్వీపమైన మిన్‌డనావోలో మెరుపు వరద సంభవించింది. దీంతో అక్కడ నివసించే 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు ప్రకటించారు.

English summary
Tens of thousands have been forced from their homes by a tropical storm that battered the southern Philippines leaving at least 182 dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X