వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫిలిప్పీన్స్ లో .. అక్టోబర్ నుండి మార్చి వరకు

|
Google Oneindia TeluguNews

రష్యా మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించింది . స్పుత్నిక్ వి పేరుతో మార్కెట్లోకి రానుందని కూడా ప్రకటించింది రష్యా . అయితే రష్యా వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాలేదని అలాంటి వ్యాక్సిన్ తో ముప్పు అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఇక ఈ సమయంలో రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క 3 వ దశ క్లినికల్ ట్రయల్స్ అక్టోబర్ నుండి మార్చి వరకు ఫిలిప్పీన్స్ లో జరుగుతాయని ఫిలిప్పీన్స్ అధ్యక్ష ప్రతినిధి హ్యారీ రోక్ ఒక ప్రకటనలో చెప్పారు.

20 నిమిషాల్లోనే కరోనా పరీక్ష ... రిజల్స్ లోనూ కచ్చితత్వం .. శాస్త్రవేత్తల రీసెర్చ్20 నిమిషాల్లోనే కరోనా పరీక్ష ... రిజల్స్ లోనూ కచ్చితత్వం .. శాస్త్రవేత్తల రీసెర్చ్

 2021 ఏప్రిల్ నాటికి రష్యన్ వ్యాక్సిన్‌ను ఫిలిప్పీన్స్ లో ఆమోదం పొందుతుందా ?

2021 ఏప్రిల్ నాటికి రష్యన్ వ్యాక్సిన్‌ను ఫిలిప్పీన్స్ లో ఆమోదం పొందుతుందా ?

ఎంక్వైరర్ వార్తాపత్రిక ఉదహరించినట్లుగా, రష్యా ప్రభుత్వం ఈ ట్రయల్స్‌కు నిధులు సమకూరుస్తుందని హ్యారీ రోక్ తెలిపారు. రోక్ చెప్పిన వివరాల ప్రకారం, 3 వ దశ ట్రయల్స్ రష్యా మరియు ఫిలిప్పీన్స్ లలో ఏకకాలంలో నిర్వహించబడతాయి.2021 ఏప్రిల్ నాటికి రష్యన్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఫిలిప్పీన్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించాలని మనీలా ప్రభుత్వం ఆశిస్తున్నట్లు రోక్ తెలిపారు.గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాకు స్పుత్నిక్ వి అని పేరు పెట్టి ఆ పేరును నమోదు చేశారు.

థర్డ్ ఫేజ్ ట్రయల్స్ ఫిలిప్పీన్స్ లో .. ట్రయల్స్ కు రష్యా నిధులు

థర్డ్ ఫేజ్ ట్రయల్స్ ఫిలిప్పీన్స్ లో .. ట్రయల్స్ కు రష్యా నిధులు


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ టీకాను ఆమోదించారు, ఇది అవసరమైన అన్ని క్లినికల్ ట్రయల్స్ లోనూ సక్సెస్ అయిందని అయితే థర్డ్ ఫేజ్ ట్రయల్స్ జరగాల్సి ఉందని తెలిపారు పుతిన్ . స్పుత్నిక్ V క్లినికల్ ట్రయల్స్ మరియు ఉత్పత్తిపై మాస్కోతో సహకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన వారిలో మనీలా ఒకటి కాగా , ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే స్వచ్ఛందంగా టీకాలు వేయడం కూడా బహిరంగంగానే మొదలు పెట్టనున్నామని చెప్పారు.

రష్యా వ్యాక్సిన్ అసంపూర్ణమే .. ఫిలిప్పీన్స్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పై తాజా ప్రకటనతో స్పష్టం

రష్యా వ్యాక్సిన్ అసంపూర్ణమే .. ఫిలిప్పీన్స్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పై తాజా ప్రకటనతో స్పష్టం

రష్యా కనిపెట్టిన కరోనా వ్యాక్సిన్ పై పలు చాలా మంది శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ విశ్వసించదగినది కాదని పేర్కొన్నారు. థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాకుండా మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్ ను ఎలా తీసుకు వస్తారని పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నించారు . థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లో కూడా సక్సెస్ అయితేనే వ్యాక్సిన్ ను రిలీజ్ చేయాలని, అలా కాకుండా ముందుగానే రష్యా వ్యాక్సిన్ రిలీజ్ చేయడం హానికరమని వ్యాఖ్యానించారు. అందుకు తగ్గట్టుగానే రష్యా వ్యాక్సిన్ హడావిడిగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే రిలీజ్ అయిందని అర్ధం అయింది. ఇక ఈ నేపధ్యంలో తాజాగా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫిలిప్పీన్స్ లో జరుగుతాయని ప్రకటన రావటం గమనార్హం .

Recommended Video

COVID-19 : China Corona Vaccine ట్రయల్స్ సక్సస్..పెరుగుతున్న రోగ నిరోధక శక్తి ! || Oneindia Telugu

English summary
Phase 3 clinical trials of the Russian COVID-19 vaccine will be held in the Philippines from October to March, Philippine presidential spokesperson Harry Roque said . The spokesperson added, as cited by the Inquirer newspaper, that the Russian government would fund the trials, which usually envisage vaccinating thousands of patients to test its efficiency and safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X