వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టీరియస్ వీనస్: శుక్రుడిపై గ్రహాంతరవాసులు?: భూమిపై విస్తారంగా దొరికే కెమికల్..వీనస్ మేఘాల్లో

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అంతరిక్షం.. అద్భుతాలమయం. అంతు తేలని, అంతే లేని వింతలకు ఆలవాలం. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఆసక్తి రేపుతుంది. ఎక్కడో పాలపుంతలకు అవతల.. సుదూర తీరాల్లో కొత్త గ్రహాలను కనుగొనడం, కృష్ణబిలాలు వెలుగులోకి రావడం, తొక్కచుక్కలు, గ్రహశకలాలు భూమికి చేరువగా ప్రయాణించడం వంటి వార్తలు ఎప్పుడూ ఉత్కంఠతకు గురి చేసేవే. విశ్వాంతరాల్లో జీవజాలాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు సాగిస్తోన్న పరిశోధనలు తాజాగా సరికొత్త మలుపు తీసుకున్నాయి. భూగోళానికి చేరువగా ఉన్న శుక్రగ్రహంపై జీవజాలం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కరోనా బీభత్సం: అరకోటికి చేరువగా కేసులు: 80 వేలను దాటిన మరణాలు: మరింత దూకుడుగాకరోనా బీభత్సం: అరకోటికి చేరువగా కేసులు: 80 వేలను దాటిన మరణాలు: మరింత దూకుడుగా

వీనస్ వాతావరణంలో ఫాస్ఫైన్

వీనస్ వాతావరణంలో ఫాస్ఫైన్

శుక్రగ్రహం వాతావరణం, మేఘాల్లో ఫాస్ఫైన్ రసాయనం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఒక ఫాస్పరస్‌ అణువుతో మూడు హైడ్రోజన్‌ అణువులు కలవడం వల్ల ఈ విష వాయువు ఏర్పడుతుంది. ఈ ఫాస్ఫైన్.. భూగోళంపై విస్తృతంగా లభిస్తుంది. రంగు ఉండని, మండే స్వభావం గల రసాయనం ఇది. ఒక స్థాయి ఉష్ణోగ్రత వద్ద పేలిపోయే స్వభావం ఉన్న ఫాస్ఫైన్ రసాయనాన్ని పరిశ్రమల్లో విరివిగా వినియోగిస్తారు. పరిశ్రమల్లో తయారూ చేస్తారు. ప్రత్యేకించి-సెమీ కండక్టర్ల తయారీలో ఫాస్ఫైన్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇందులో నుంచి వెల్లులి లేదా కుళ్లిపోయిన చేప తరహా దుర్వాసనను ఇది వెదజల్లుతుంటుంది. విషపూరితమైనది.

బ్యాక్టీరియాల ద్వారా ఉత్పన్నం..

బ్యాక్టీరియాల ద్వారా ఉత్పన్నం..

ఈ కెమికల్ శుక్రగ్రహం వాతావరణంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. కొన్ని రకాల చిత్తడి నేలల్లో జీవించే సూక్ష్మజీవులు ఈ ఫాస్ఫైన్‌ను పీల్చడం ద్వారా మనుగడ సాగిస్తుంటాయి. హవాయ్‌లోని జేమ్స్ క్లర్క్ మ్యాక్స్‌వెల్ టెలిస్కోప్, చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్ మిల్లీమీటర్ ఆర్రీ రేడియో టెలిస్కోప్ ద్వారా ఈ కెమికల్‌ను గుర్తించారు. కొన్ని రకాల బ్యాక్టీరియాల ద్వారా వెలువడే ఫాస్ఫైన్ కెమికల్ వీనస్‌కు చెందిన యాసిడ్ సహిత మేఘాల్లో ఎలా వచ్చిందనే అంశం అంతు పట్టట్లేదని వేల్స్‌లోని కార్డిఫ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జేన్ గ్రీవ్స్ వెల్లడించారు. ఈ మేరకు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ఓ ప్రత్యేక కథనాన్ని రాశారు.

ఫాస్ఫైన్ ఉందీ అంటే..

ఫాస్ఫైన్ ఉందీ అంటే..

శుక్రగ్రహంపై బ్యాక్టీరియాలు ఉండొచ్చని, ఏలియన్ల నివాసానికి పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాయని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏలియన్ల కోసం ఇప్పటిదాకా సాగిస్తోన్న అన్వేషణలో కొత్త కోణాన్ని వీనస్ మేఘాలు ఆవిష్కరించినట్టయిందని మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాలిక్యులర్ ఆస్ట్రోఫిజిసిస్ట్, క్లారా సాసా సిల్వ తెలిపారు. ఫాస్ఫైన్ ఉందీ అంటే.. అక్కడ జీవం ఉండి తీరుతుందని తేల్చి చెప్పారు. అంతులేని విశ్వంలో మనం ఒంటరి కాదనే సంకేతాలను ఇచ్చినట్టుగానే తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

మిస్టరీని ఛేదించే దిశగా..

మిస్టరీని ఛేదించే దిశగా..

జీవం ఉందనడానికి ఇంతకుముందు వరకూ గుర్తించిన సంకేతాల కంటే ఇది బలంగా ఉందని చెప్పారు. ఫాస్ఫైన్ ఎలా వచ్చిందనే మిస్టరీని ఛేదించగలిగితే.. వీనస్‌పై జీవజాలం ఉందా? లేదా? అనేది స్పష్టమౌతుందని అన్నారు. శుక్రగ్రహంపై జీవం ఉంటుందనే కోణంలో ఎప్పుడూ అన్వేషణను సాగించలేదని క్లారా తెలిపారు. భూమితో పోల్చుకుంటే.. అక్కడి వాతావరణం భయానకంగా ఉంటుందని అన్నారు. అక్కడ 96 శాతం వాతావరణం కార్బన్‌ డయాక్సైడ్‌తో నిండి ఉంటుందని, ఉపరితల ఉష్ణోగ్రత 400 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వరకు నమోదవుతుంటాయని అన్నారు.

Recommended Video

7.5 Magnitude Earthquake Triggers Tsunami Warning | What's Happening To Earth
ఫాస్ఫైన్ నమూనాలు లభించడం..

ఫాస్ఫైన్ నమూనాలు లభించడం..

సూర్యుడి నుంచి రెండో గ్రహం కావడం వల్ల ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుందని తన కథనంలో రాసుకొచ్చారు. అలాగే- శుక్రుడి మీద ఉండే మేఘాల్లో 75-95 శాతం సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌తో నిండి ఉంటాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫాస్ఫైన్ లభించడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని, దీని మీద మరింత విస్తృత పరిశోధనలు సాగించడానికి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. పారిశ్రామికంగా తయారు చేయగల ఈ రసాయనం వీనస్ మేఘాల్లో లభించడం పట్ల శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అక్కడ ఎలాంటి జీవం ఉండొచ్చన దిశగా ఆరా తీస్తున్నారు.

English summary
Scientists said on Monday they have detected in the harshly acidic clouds of Venus a gas called phosphine that indicates microbes may inhabit Earth’s inhospitable neighbour, a tantalizing sign of potential life beyond Earth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X