• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైరల్ : ముస్లిం మహిళను హత్తుకున్న పోలీస్ ఆఫీసర్..ఎందుకో తెలుసా..?

|

కోపెన్‌హాగెన్: డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగన్‌లో జరిగిన ఓ ఘటన తాలూకు ఫోటో మరియు వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. డెన్మార్క్‌లో భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం ముస్లిం మహిళలు బయటకు వచ్చేసమయంలో బుర్ఖాలు ధరించరాదని ఆ దేశ పార్లమెంటులో బిల్లు పాస్ చేసింది. అయితే దీనిపై చాలా మంది ముస్లింమహిళలు నిరసన తెలిపారు. రోడ్డెక్కి తమ నిరసనను వ్యక్తపరిచారు.

ఇలా తమ నిరసనలు తెలుపుతుండగా అయా అనే ఓ 37 ఏళ్ల మహిళ చాలా ఎమోషనల్‌ అయ్యింది. తాము చేస్తున్న నిరసన కార్యక్రమానికి చాలా మంది మహిళల నుంచి మద్దతు లభిస్తోందని చెప్పి ఆయా భావోద్వేగానికి గురైంది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ బుర్ఖా ధరించిన అయా అనే ఈ మహిళను గట్టిగా కౌగిలించుకుని ఓదార్పునిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను రైటర్స్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ కెల్లీ తన కెమెరాలో బంధించారు. ఇక దీనిపై రాసిన కథనాలు సోషల్ మీడియాలో అత్యధికంగా వీక్షించారు. అంతేకాదు నెటిజెన్లు కూడా ఈ గ్రాండ్ మూమెంట్‌ను విపరీతంగా షేర్ చేశారు.

Photo of Danish policewoman and Muslim hugging at demonstration goes viral

"ఈ అద్భుతమైన భూమిని ఇద్దరం కలిసి రక్షించుకుందాం అని చెబుతున్నట్లుగా ఉంది. ఈ ఇద్దరు మహిళలే అంతా అన్నట్లుగా ఉంది. ఇక్కడ బుర్ఖానో లేదా యూనిఫారం గురించి ఉన్నట్లు లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పినప్పుడు అదంతా మరిని వారి ప్రేమను మాత్రమే పంచుతున్నట్లుగా ఉంది"అని నిదల్ ఎల్ జాబ్రి అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

బుర్ఖా లేనిదే తను బయటకు వెళ్లలేనని చెప్పిన అయా... డెన్మార్క్‌ను ఇలా చూస్తామని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగా వచ్చిన చట్టంతో తాను బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని , తన పిల్లలను స్కూలు నుంచి తీసుకురావాలంటే బుర్ఖా ధరిస్తేనే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని వాపోయింది. బుర్ఖా తీసి బయటకు వచ్చే కంటే...ఇంట్లోనే ఒక బంధీగా ఉంటానని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యింది అయా. మహిళా పోలీస్ ఆఫీసర్‌తో దిగిన ఫోటోపై మాట్లాడిన అయా... ఆ పోలీస్ అధికారిణి తనతో చాలా ప్రేమగా మాట్లాడే సరికి తన బాధను ఆపుకోలేక పోయినట్లు చెప్పింది. అంతేకాదు వ్యక్తిగతంగా బుర్ఖాల నిషేధంపై తాను కూడా వ్యతిరేకమని ఆ పోలీస్ అధికారిణి తనతో చెప్పినట్లు అయా వెల్లడించింది.

English summary
A photo of a police officer hugging an emotional niqab-wearing woman at a demonstration in Denmark has become one of the country’s most widely-shared images this week.The demonstration in Copenhagen’s Nørrebro neighbourhood took place as a new law banning public wearing of face-covering garments including Islamic veils came into effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X