వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వయస్సు 77, రికార్డ్: 66 ఏళ్లు సెలవు పెట్టలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

మేరీల్యాండ్: ఉద్యోగులు.. ఎవరైనా తమ జీవితంలో ఒక్కసారైనా సిక్ లీవ్ పెట్టే పరిస్థితి ఉంటుంది! కానీ, ఓ ఫోటో గ్రాఫర్ మాత్రం 66 ఏల్లుగా ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టక పోవడం గమనార్హం. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుంటే సిక్ లీవ్ ఉపయోగించుకుంటుంటారు.

అయితే, అమెరికాలోని ఓ ఫొటో గ్రాఫర్‌ మాత్రం దశాబ్దాలుగా సిక్‌ లీవ్‌ పెట్టలేదు. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని హానోవర్‌కు చెందిన తిమోతీ హైమాన్‌ మేరీల్యాండ్‌ స్టేట్‌ హైవే అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఇతను మరికొద్ది రోజుల్లో 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.

Photographer Worked For 66 years and Never Took a Sick Day

పదవీ విరమణ కూడా పొందుతున్నారు. మేరీల్యాండ్‌ రాష్ట్రంలో సుదీర్ఘకాలం సర్వీసు చేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. మేరీల్యాండ్‌ రాష్ట్రానికి సంబంధించి రోడ్డు నిర్మాణాలు, రవాణా వ్యవస్థ మార్పులన్నీ తిమోతీ తన కెమెరాతో తీశారు.

వాటిపై ఎన్నో డాక్యుమెంటరీలు రూపొందించారు. రాష్ట్ర రవాణా వ్యవస్థ మార్పులకు సంబంధించి, రాష్ట్ర చరిత్రకు సంబంధించి ఆయన తీసిన ఫొటోలు ఉన్నాయి. సుదీర్ఘకాలం పని చేయడమే కాకుండా ఇన్నేళ్లుగా సెలవు తీసుకోకుండా నిబద్ధతతో పని చేశాడు. ఇందుకు గాను రాష్ట్ర గవర్నర్‌ ల్యారీ హోగాన్‌ తిమోతీని సత్కరిస్తారు.

English summary
The top of Timothy Hyman's desk is barely visible, with piles of head shots of current and former state employees scattered across it. Enlarged photos of highways, bridges and intersections throughout the state of Maryland are taped to his office walls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X