వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ ప్రైజ్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

స్టాక్ హోం: 2016 సంవత్సరానికి గాను భౌతిక‌శాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ ప్రైజ్ లభించింది. ప‌దార్థానికి సంబంధించిన అసాధార‌ణ ద‌శ‌ల‌ను వెలికి తీయ‌డంలో చేసిన అధ్య‌య‌నానికి గాను డేవిడ్ దౌలస్, డంకన్ హోల్డన్, మైఖెల్ క్లోస్టర్లిజ్ లకు నోబెల్ ప్రైజ్‌ను ప్ర‌క‌టించారు.

<strong>మెడిసిన్‌లో జపాన్ ప్రొఫెస‌ర్‌ యొషినోరి ఒషుమికి నోబెల్ ప్రైజ్</strong>మెడిసిన్‌లో జపాన్ ప్రొఫెస‌ర్‌ యొషినోరి ఒషుమికి నోబెల్ ప్రైజ్

ప్రైజ్ మనీ కింద ప్రకటించిన మొత్తంలో సగ భాగం డేవిడ్ దౌలస్‌కు, మిగతా సగ భాగం డంకన్ హోల్డన్, మైఖెల్ క్లోస్టర్లిజ్‌లకు అందజేయనున్నట్లు మంగళవారం స్టాక్‌హోమ్‌లోని నోబెల్ క‌మిటీ ప్ర‌క‌టించింది. ప‌దార్థానికి సంబంధించి ఓ కొత్త ప్ర‌పంచాన్ని ఈ శాస్త్ర‌వేత్త‌లు ఆవిష్క‌రించార‌ని ఈ సంద‌ర్భంగా ఎంపిక క‌మిటీ ప్ర‌క‌టించింది.

Physics Nobel awarded for discoveries on exotic matter

అత్యాధునిక గ‌ణిత‌శాస్త్ర ప‌ద్ధ‌తులు ఉప‌యోగించి ప‌దార్థానికి చెందిన సూప‌ర్ కండక్ట‌ర్స్‌, సూప‌ర్ ఫ్లూయిడ్స్‌లాంటి అసాధార‌ణ ద‌శ‌లపై వీరు అధ్య‌య‌నం చేశార‌ని క‌మిటీ ప్రకటనలో పేర్కొంది. ప్రతి ఏటా స్టాక్‌హోమ్‌లోని రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ వివిధ రంగాల్లో నోబెల్ అవార్డులను ప్ర‌క‌టిస్తుంది.

English summary
The Nobel Prize in Physics for 2016 has been divided, one half awarded to David J. Thouless, the other half jointly to F. Duncan M. Haldane and J. Michael Kosterlitz "for theoretical discoveries of topological phase transitions and topological phases of matter."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X