వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్లో విమానం అల్లకల్లోలం: 378 మంది సేఫ్

|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: మలేషియా ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలైన ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.

ఆదివారం లండన్ నుంచి మలేషియాకు ఎమ్ హెచ్ - 1 విమానం బయలుదేరింది. విమానంలో 378 మంది ప్రయాణికులు ఉన్నారు. బంగాళాఖాతం సముద్రం మీద ప్రయాణిస్తున్న సమయంలో విమానం భారీ కుదుపులకు లోనైయ్యింది. సుమారు రెండు నిమిషాల పాటు విమానం అల్లకల్లోలం సృష్టించింది.

విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కేకలు వేస్తూ ఆర్తనాదాలు చేశారు. పలువురు ప్రయాణికులకు గాయాలైనాయి. 378 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినంత పని అయ్యింది. విమానాన్ని కౌలాలంపూర్ లో ల్యాండ్ చేశారు.గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.

Pictures posted online by passengers showed toppled food trolleys,

తల్లిదండ్రులతో అదే విమానంలో ప్రయాణిస్తున్న హరీత్ (13) అనే బాలుడు విమానం కుదేలు అయిన సమయంలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తరువాత హరీత్ మీడియాతో మాట్లాడుతూ రెండు నిమిషాల పాటు అందరిని అటు ఇటు విసిరేసినట్లు అయ్యిందని చెప్పాడు.

రెండు నిమిషాల తరువాత సాధారణ స్థితికి రావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారని అన్నాడు. విమానం ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నామని మలేషియా ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.

మలేషియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. లండన్ నుంచి మలేషియా వెలుతున్న ఎమ్ హెచ్ 1 విమానం ఆకాశంలో వెలుతున్న సమయంలో రెండు నిమిషాల పాటు అల్లకల్లోలం సృష్టించింది. విమానంలో 378 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు, విమాన సిబ్బందికి గాయాలైనాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

English summary
Malaysia Airlines flight MH1 to had 378 passengers on board when it hit turbulence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X