వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైలట్లతో పాటు వారి తప్పిదంతోనే ఆ విమాన ప్రమాదం: నివేదిక

|
Google Oneindia TeluguNews

గతేడాది ఇండోనేషియాలో ఓ బోయింగ్ విమానం కూలిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రయాణిస్తున్న 189 మంది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణం గ్రౌండ్ సిబ్బంది, కాక్‌పిట్‌లో లోపాలు, విమానంలో కూడా చాలా లోపాలున్నాయని విచారణ ద్వారా బయటపడింది. ఇండోనేషియా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ ప్రమాదంపై విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించింది. ఆటోమేషన్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇదే విమానం కూలేందుకు ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది కమిటీ. సెన్సార్లు పనిచేయకపోవడం, మెయిన్‌టెనెన్స్ లేకపోవడం, పైలట్లకు సరైన శిక్షణ లేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందనే అంచనాకు వచ్చింది కమిటీ.

గతేడాది జరిగిన విమాన ప్రమాదం

గతేడాది జరిగిన విమాన ప్రమాదం

అక్టోబర్ 29, 2018లో లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం జకార్తా నుంచి పినాంగ్‌కు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన 13 నిమిషాలకే ఆ విమానం జావా సముద్రంలో కూలింది. ఇందులో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఇక ఆ తర్వతా ఈ ఏడాది మార్చిలో ఇతియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం అడీస్ అబాబా నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో 157మంది మృతి చెందారు. ఈ ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోయింగ్ 737 విమానాలపై నిషేధం విధించారు. ఈ రెండు ప్రమాదాల్లో విచారణ జరిపాకే ఒక నిర్ణయం తీసకోవాలని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఇక రెండు ప్రమాదాలకు కారణం ఆటోమేటెడ్ వ్యవస్థనే అని విచారణాధికారులు గుర్తించారు.

పనిచేయని ఆటోమేటిక్ వ్యవస్థ

పనిచేయని ఆటోమేటిక్ వ్యవస్థ

ఈ నెల మొదట్లో ఇచ్చిన నివేదికలో బోయింగ్ సంస్థపై అధికారులు నిప్పులు చెరిగారు. టెక్నికల్ అంశాలను సరిగ్గా టెస్ట్ చేయకుండా విమానాలు ఎగిరేందుకు ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం నియంత్రణ తప్పుతున్నప్పుడు ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేయకుండా పోయిందని రెండు విమాన ప్రమాదాల్లో ఇదే జరిగిందని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బోయింగ్ యాజమాన్యం చాలా విషయాలను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర దాచిఉంచిందని చెప్పింది. ఇదిలా ఉంటే బోయింగ్ సంస్థ ఆటోమేటిక్ వ్యవస్థలో కొన్ని పారామీటర్లను మార్చివేసిందని ఆ విషయాలను అధికారులకు తెలపలేదని కమిటీ ధృవీకరించింది.

సెకండ్ హ్యాండ్ పరికరాన్ని అమర్చిన గ్రౌండ్ సిబ్బంది

సెకండ్ హ్యాండ్ పరికరాన్ని అమర్చిన గ్రౌండ్ సిబ్బంది


ఇదిలా ఉంటే విమాన ప్రమాదానికి కారణం గ్రౌండ్ సిబ్బంది కూడా అని కమిటీ తేల్చింది. ఇండోనేషియాలో విమానం కూలకముందు ఒక్కరోజు గ్రౌండ్ సిబ్బంది యాంగిల్ ఆఫ్ అటాక్ అనే పరికరాన్ని అమర్చారని అయితే అది సెకెండ్ హ్యాండ్ పరికరం అని గుర్తించింది. ఆ పరికరం ద్వారా ఆటోమేటిక్ వ్యవస్థకు సమాచారం చేరుతుందని చెప్పారు. అయితే ఈ పరికరం అమర్చిన తర్వాత విమానంను టెస్ట్ చేయలేదని కమిటీ పేర్కొంది. మరోవైపు అక్టోబర్ 2018 విమానం మెయింటెనెన్స్ రికార్డులో 38 పేజీలు మిస్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

 నాలుగు నిమిషాల్లోనే...

నాలుగు నిమిషాల్లోనే...

ఇక విమానం ప్రమాద పరిస్థితుల్లో ఉందని గ్రహించిన పైలట్ ఫస్ట్ ఆఫీసర్‌ను మానువల్ చూసి సమస్య ఏంటో గుర్తించాల్సిందిగా కోరారు. విమానంలో ఉన్న రెండు సెన్సార్ల రీడింగ్‌లు తప్పుగా కనిపించాయి. అయితే ఫస్ట్ ఆఫీసర్ విమానంను ఆటో పైలట్ మోడ్‌లో ఉంచమని చెప్పడంలో ఆలస్యం చేశాడు. కో పైలట్‌ చెక్‌లిస్టు చేసేందుకు నాలుగు నిమిషాల సమయం తీసుకోవడంతో ప్రమాదం జరిగిపోయిందని నివేదిక వెల్లడించింది.

English summary
A series of failures and missteps on the ground and in the cockpit resulted in the crash of a Boeing 737 Max in Indonesia last year that killed all 189 passengers and crew aboard, a new report released Friday concludes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X