వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే ఇండియా వీక్-18: మా ప్రజలపై నమ్మకముంది, 300సీట్లకుపైగా సీట్లతో మళ్లీ అధికారం మాదే: పీయూష్ గోయల్

|
Google Oneindia TeluguNews

లండన్: ఇంగ్లాండ్‌లోని లండన్‌లో జరుగుతున్న యూకే ఇండియా వీక్-2018 సమావేశంలో భారత రైల్వే, కోల్‌ మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు.

భారత్‌లో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని పీయూష్ గోయల్ చెప్పారు. అంతేగాక, చాలా ఏళ్ల తర్వాత నగదు నిల్వలు స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ప్రతీ అంశంలో భారత్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.

నమ్మకమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్‌లో అవినీతి రహిత పాలన సాగుతోందని చెప్పారు. క్లీన్ మనీ పాలసీని అవలంభిస్తున్నామని తెలిపారు. గతంలో చైనాలో చోటు చేసుకున్న సంస్కరణలో ఇప్పుడు భారత్‌లో అమలవుతున్నాయని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు. స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలతో ఆరోగ్య భారత్ నిర్మితమవుతోందని చెప్పారు.

గత ప్రభుత్వాల్లా కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం ముందుకెళుతోందని పీయూష్ గోయల్ తెలిపారు. 2014కు ముందు జరిగిన వ్యవహారంలా కాకుండా బీజేపీ నూతన విధానాలను అవలంభిస్తోందని చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలా కాకుండా దేశ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సంస్కరణలను చేపడుతున్నామని చెప్పారు. దీర్ఘ కాలిక పెట్టుబడులపై దృష్టి సారించామని చెప్పారు.

గత ప్రభుత్వాల్లా.. బీజేపీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకుండా ఎలా బ్యాలెన్స్ చేశారని సంజయ్ నాయర్ ప్రశ్నించగా.. తాము ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నామని పీయూష్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల కోసం కాకుండా భారత భవిష్యత్ బాగుండేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రయోజనాలకు అనుకూలంగా ప్రధాని మోడీ పనిచేస్తారని ప్రజలు నమ్మతున్నారని తెలిపారు.

భారత బ్యాంకింగ్ సెక్టార్‌ సమస్యల గురించి సంజయ్ నాయర్ ప్రశ్నించగా.. అవసరమైన సందర్భంలో బ్యాంకింగ్ సెక్టార్‌కు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని చెప్పారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాంకులు తీసుకునే మంచి నిర్ణయాలకు ప్రభుత్వ అండగా ఉంటుందని పీయూష్ గోయల్ తెలిపారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని అన్నారు.

భారత్‌కు మార్కెట్ డిమాండ్ బాగా ఉందన్న పీయూష్ గోయల్.. రెండంకెల వృద్ధిరేటు అసాధ్యమేమీ కాదన్నారు. మెరుగవుతున్న మౌలిక సదుపాయాలు కూడా రెండంకెల వృద్ధిరేటుకు తోడ్పడతాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి రంగం కూడా కీలకంగా మారుతోందని అన్నారు.

ఎన్నికలు వచ్చేనాటికి భారత ప్రజలపై తమకు పూర్తి నమ్మకముందని పీయూష్ గోయల్ చెప్పారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఢిల్లీలో బలమైన నేత ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లకుపైగా సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ తమ అభివృద్ధి విధానాలను కొనసాగిస్తామని చెప్పారు.

Piyush Goyal on FDI into India Private capital opportunities

ఈ సమావేశంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కేకేఆర్ సీఈఓ సంజయ్ నాయర్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను అవలంభిస్తోందని అన్నారు.భారత ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వకుండా మంచి పని చేసిందని కేకేఆర్ ఇండియా (ఇది లీడింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ) సీఈవో సంజయ్ నాయర్ అన్నారు. ద్రవ్యోల్బణం అని భావిస్తే ప్రజలు తమ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాలపై ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ద్రవ్యోల్భణం అంచనాలు ఎక్కువగా ఉంటే డబ్బు రూపంలో రుణాలు చెడు ఏమీ కాదన్నారు.

Piyush Goyal on FDI into India Private capital opportunities

ఎగుమతులు ఎంతో కీలకమని చెప్పారు. ప్రతి సెక్టార్ అండర్ డెవలప్‌లో ఉందని, దానికి సమయం పడుతుందన్నారు. సంక్షేమ పథకాలను ఎక్కువగా ప్రోత్సహించకపోవడం ద్వారా ప్రభుత్వం మంచి పని చేస్తోందని చెప్పారు. బ్యాంకుల ప్రయివేటీకరణపై ఆలోచించాలన్నారు.

భారతీ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ భారతీ మిట్టల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశం పలు పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.

రాకేష్ భారతి మిట్టల్ మాట్లాడుతూ.. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వృద్ధిలో భాగంగా ఉండాలన్నారు. భారత ఎఫ్‌డీఐ ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుత పాలసీ అన్నారు. భారత ప్రభుత్వం ఓ వైపు ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తోందని, మరోవైపు చాలామంది స్వదేశీ వస్తు రక్షణ విధానం గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత ఉత్సాహాన్ని పెంచిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభత్వాలు అవసరాన్ని మించి ముందుకు సాగుతున్నాయన్నారు. జీఎస్టీ అమలు ప్రపంచంలో అత్యంత వేగంగా ఉందని రాకేష్ మిట్టల్ చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ భారత యువత ఉద్యోగాలు కోరుకునే వారు కాకుండా.. ఇచ్చేవారు కావాలని ఆకాంక్షిస్తున్నారని చర్చలో పాల్గొన్న భారత డిప్యూటీ సెక్రటరీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్) శృతి సింగ్ తెలిపారు.

piyush-goyal-on-fdi-into-india-private-capital-opportunities

డిఫెన్స్, ఏరోస్పేస్, మెడిసిన్ రంగాల్లో భారత్ ముందుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నివేదిక ప్రకారం ఒకే సంవత్సరంలో భారత్ 30స్థానాలు ఎగబాకిందని చెప్పారు.

English summary
Piyush Goyal, Minister for Finance Railways & Coal, will be in conversation with Sanjay Nayar, over an interactive video conference FDI into India Private capital opportunities in India Creating local capital pools for long-term infrastructure requirements - moving long-term savings into investments India Inc's UK-India Week 2018, being held in London and Buckinghamshire from 18-22 June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X