వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్ నుంచి కొచ్చికి చేరిన నర్సుల విమానం (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

కొచ్చి: ఇరాక్ నుంచి 183 మందితో కూడిన భారతీయులతో ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం కేరళ రాష్ట్రంలోని కొచ్చికి చేరుకుంది. ఇందులో మిలిటెంట్ల అపహరణకు గురైన 46 మంది నర్సులు కూడా ఉన్నారు. శనివారం మధ్యాహ్నం విమానం కొచ్చికి చేరుకుంది.

నర్సులకు స్వాగతం చెప్పడానికి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ విమానాశ్రయానికి వచ్చారు. ఆ విమానం ఆంతకు ముందు ముంబైో ఆగింది. ప్రయాణికులు ఆహారం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కొచ్చికి చేరుకుంది.

ఇరాక్ నుంచి కొచ్చికి

ఇరాక్ నుంచి కొచ్చికి

ఇస్లామిక్ మిలిటెంట్లు ఆక్రమించుకున్న ఇరాక్‌లోని తిక్రిత్ ప్రాంతంలో చిక్కుకున్న కేరళ నర్సులు శనివారం కొచ్చికి చేరుకున్నారు. 46 మంది నర్సులు తమ సొంత ప్రాంతానికి చేరుకున్నారు.

ఇరాక్ నుంచి కొచ్చికి..

ఇరాక్ నుంచి కొచ్చికి..

కొచ్చికి ప్రత్యేక విమానంలో చేరుకున్న నర్సులకు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వాగతం చెప్పారు.

ఇరాక్ నుంచి కొచ్చికి...

ఇరాక్ నుంచి కొచ్చికి...

అంతకు ముందు విమానం ఇంధనం నింపుకోవడానికి, ప్రయాణికులు ఆహారం తీసుకోవడానికి ముంబైలో కాసేపు ఆగింది.

ఇరాక్ నుంచి కొచ్చికి..

ఇరాక్ నుంచి కొచ్చికి..

మిలిటెంట్ల చేతిలో బందీలుగా ఉన్న 46 మంది కేరళ నర్సులు చివరికి విముక్తి పొంది భారత్ చేరుకున్నారు.

చాలా వారాలుగా 46 మంది భారత నర్సులు తిక్రిత్ ఆస్పత్రిలో బందీలుగా ఉన్నారు. తిక్రిత్ నుంచి మోసుల్‌కు మిలిటెంట్లు వారిని జులై 3వ తేదీన తీసుకుని వెళ్లారు. వారు మోసుల్‌కు ఈ అర్థరాత్రి చేరుకున్నారు.

నర్సులకు మిలిటెంట్లు ఏ విధమైన అపాయం తలపెట్టలేదని, వారిని మోసుల్‌లో రెండు గదుల్లో ఉంచారని సమాచారం. ఎస్కార్ట్స్ వారికి ఆహారం, నీళ్లు అందించారు. నర్సుల పట్ల తొలుత కాస్తా పట్టువిడుపులతో వ్యవహరించినప్పటికీ తర్వాత కఠినంగా మెసిలినట్లు సమాచారం. ఆ విమానం ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాదులో వంద మంది దాకా దిగిపోయినట్లు సమాచారం

English summary
A special Air India flight with 183 people on board, including the 46 nurses freed by insurgents in Iraq, arrived here on Saturday noon, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X