• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్లామా మజాకా..! పక్క సీటు అమ్మాయిని చూస్తున్నాడని మొగున్ని పరిగెత్తిచ్చి కొట్టింది..! (వీడియో)

|
  పక్క సీటులో అమ్మాయిని చూస్తున్నాడని మొగుణ్ణి పరిగెత్తిచ్చి కొట్టింది..! (వీడియో)

  భర్త పట్టించుకోకపోతే ఏ భార్యైనా ఏం చేస్తుంది. అలుగుతుంది. ఏడుస్తుంది. గొడవ పెట్టుకుంటుంది. కానీ అమెరికాలో ఓ మహిళ మాత్రం తనను పట్టించుకోవడం లేదని మొగుడిని ఉతికి ఆరేసింది. అదీ ఇంట్లో అనుకుంటే పొరపాటే. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో భర్తను పరిగెత్తించి మరీ కొట్టింది. అపరకాళికలా మారిన ఆమెను చూసి ఫ్లైట్‌లోని ఇతర ప్యాసింజర్లు షాక్ అయ్యారు.

  భర్త పట్టించుకోవడంలేదని

  గత ఆదివారం మియామి నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్లాల్సిన విమానం టేకాఫ్‌కు రెడీ అవుతోంది. ఈక్వెడార్ వెళ్లిన మెక్ లామోర్, ఆమె భర్త అదే విమానంలో లాస్ ఏంజెల్స్‌కు బయలుదేరారు. అయితే ఫ్లైట్‌లో ఎక్కిన తర్వాత భర్త ప్రవర్తన లామోర్‌కు నచ్చలేదు. ఆయన తనతో మాట్లాడకపోవడంతో పాటు పట్టించుకోవడం లేదని కోపం వచ్చింది. ఇంతలో మొగుడు కాస్తా పక్కనున్న అమ్మాయిని చూడటంతో అది చూసిన భార్యకు కోపం నషాళానికంటింది. ఒక్కసారిగా సీట్‌లోంచి లేచి తనను పట్టించుకోకుండా వేరే అమ్మాయిని చూస్తున్న భర్తను బండ బూతులు తిట్టింది. అడ్డుకోబోయిన ఫ్లైట్ అటెండెంట్‌ను అనరాని మాటలు అంది.

  ల్యాప్‌టాప్‌తో దాడి

  ల్యాప్‌టాప్‌తో దాడి

  భార్య బండ బూతులు తిడుతుంటడంతో ఫ్లైట్ అటెండెంట్ భర్తను వేరే సీటుకు వెళ్లి కూర్చోవాలని కోరింది. దీంతో ఆయన సీటులోంచి లేవగానే లామోర్ ఉగ్ర కాళి అవతారం ఎత్తింది. సీటులోంచి లేచి వచ్చిన భర్తపై ఒక్కసారిగా దాడికి దిగింది. దీంతో అతను ఆమె నుంచి తనను తాను రక్షించుకునేందుకు అక్కడి నుంచి పరిగెత్తగా వెంబడించి మరీ అతనిపై ల్యాప్ టాప్ విసిరింది. అది కాస్తా భర్తతో పాటు ఫ్లైట్ అటెండెంట్‌ మరో ప్యాసింజర్‌కు తగలి వారికి గాయాలయ్యాయి. కోపంతో ఊగిపోయిన లామోర్ సీట్ వద్దకు వచ్చి పైన ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్ నుంచి తన బ్యాగ్ తీసుకుని ఫ్లైట్ దిగి వెళ్లిపోయింది. ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

  లామోర్ కోసం పోలీసుల గాలింపు

  లామోర్ కోసం పోలీసుల గాలింపు

  లామోర్ ఫ్లైట్ దిగిన తర్వాత ఆమె భర్త కూడా విమానం నుంచి దిగిపోయాడు. ఫ్లైట్‌లో రచ్చ చేసిన ఆమెపై విమానసిబ్బంది పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు వచ్చే సరికి లామోర్ పత్తాలేకుండా పోయింది. దాడి చేసినందుకుగానూ ఆమె భర్తను కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరగా అందుకు ఆయన నిరాకరించారు. అయితే ఫ్లైట్‌లో గొడవ చేసినందుకుగాను లామోర్‌పై కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

  సోషల్ మీడియాలో వైరల్

  సోషల్ మీడియాలో వైరల్

  సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. గొడవ జరిగిన సమయంలో భర్త ఎమర్జెన్సీ డోర్ పక్క సీట్‌లో కూర్చున్నాడు. ఒకవేళ విమానం టేకాఫ్ అయ్యాక ఈ గొడవ జరిగి ఉంటే మిగతా ప్రయాణీకుల పరిస్థితి ఏమయ్యేదో అని అంటున్నారు.

  English summary
  Passengers on an American Airlines flight from Miami to Los Angeles got a front row seat to a blowout fight between a married couple seated in the exit row. A woman, identified by police as Tiffany McLemore, can be heard yelling expletives at her husband on various videos taken by fellow passengers, and circulating on social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X