వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెరైటీ సీన్ : గాల్లో ఎగరాల్సిన విమానం.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి..! (VIDEO)

|
Google Oneindia TeluguNews

చైనా : అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి ఫన్నీగా అనిపించినా.. మరికొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా కనిపిస్తుంటాయి. అదే క్రమంలో చైనాలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాల్లో ఎగరాల్సిన విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోవడం చర్చానీయాంశంగా మారింది.

విమానమేంటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏంటని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది నిజంగానే జరిగింది. రన్‌వే పై దూసుకెళ్లాల్సిన విమానం కాస్తా ఫుట్ ఓవర్ బ్రిడ్జి కిందకు ఎలా దూరిందనే అనుమానం రావొచ్చు. అయితే అది అనుకోకుండా జరిగింది కాదు. ఒకచోటి నుంచి మరో చోటకు తరలించే క్రమంలో ఈ సన్నివేశం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా చక్కర్లుకొడుతోంది.

 plane stuck under bridge in harbin town china

చైనాలోని హర్బిన్ పట్టణంలో విమానం తరలించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ట్రక్కుపై విమానం తీసుకెళుతున్న సందర్భంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. అయితే దాన్ని తరలించేటప్పుడు ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రెక్కలు పెద్దవిగా ఉండటంతో వాటిని తొలగించారు. అయితే హైట్ విషయంలో మాత్రం ఆలోచించలేకపోయారు. అదలావుంటే ఆ ట్రక్కు వెళ్లే మార్గంలో ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉందని తెలుసుకోలేక పోయారా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.

మా పొట్ట కొట్టొద్దు.. మద్దతు ఇవ్వండి.. ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసనమా పొట్ట కొట్టొద్దు.. మద్దతు ఇవ్వండి.. ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

ఫుట్ బ్రిడ్జి కింద విమానం ఇరుక్కుపోవడంతో అటు ముందుకెళ్లలేక.. ఇటు వెనక్కి వెళ్లలేక ట్రక్కు డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు. చివరకు ట్రక్కు టైర్లలో కాస్తా గాలిని తీసేశారు. అలా ట్రక్కు హైట్ కాస్తా తగ్గింది. అనంతరం ఆ ట్రక్కును ఫుట్ బ్రిడ్జి నుంచి తప్పించారు. ఆ తర్వాత మళ్లీ ట్రక్కు టైర్లలో గాలి నింపి అక్కడి నుంచి తరలించారు.

English summary
The plane was being transported on a trailer truck when it got stuck under a low lying footbridge in china.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X