వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

14 ఏళ్ల వయసులోనే మొదలు.. ఇప్పటికి వేలసార్లు రేప్... ఎన్నో అబార్షన్లు.. ఓ యువతి కన్నీటిగాథ!

పధ్నాలుగేళ్ల వయసు నుంచే ఆమె జీవితంలో అత్యాచార పర్వం మొదలైంది. పదిహేనేళ్లపాటు నరకం అనుభవించిందామె. ఇప్పటికి కొన్ని వేలమంది ఆమెను మానభంగం చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్‌ : పధ్నాలుగేళ్ల వయసు నుంచే ఆమె జీవితంలో అత్యాచార పర్వం మొదలైంది. పదిహేనేళ్లపాటు నరకం అనుభవించిందామె. ఇప్పటికి కొన్ని వేలమంది ఆమెను మానభంగం చేశారు. అలా 11 సార్లు గర్భవతి కూడా అయింది. ఏడుసార్లు అబార్షన్లు జరిగాయి. అయినప్పటికీ ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు.

ఈ పదిహేనేళ్ల కాలంలో ఆమె ఎన్నో ముఠాల చేతుల్లో నలిగిపోయింది. ఒక రాష్ట్రం కాదు, దేశం నలుమూలలా లైంగిక దోపిడీకి గురైంది. ఏం జరిగినా ఇప్పుడు తన ఇద్దరు బిడ్డలను ప్రేమించడంలో తన శేష జీవితాన్ని గడిపేందుకు ఆమె ప్రయత్నిస్తోంది.

14 ఏళ్ల వయసులోనే.. ఇంట్లోనే..

14 ఏళ్ల వయసులోనే.. ఇంట్లోనే..

వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధితురాలి అసలు పేరును ఇక్కడ బహిర్గతం చేయడం లేదు. ఆమె 14వ ఏట.. ఆమె ఇంట్లోనే మొదలైన లైంగిక దాడి నిరాటంకంగా 15 ఏళ్లపాటు కొనసాగింది. ఈ మధ్య కాలంలో ఆమె ఎన్నో ముఠాల్లోకి చేతులు మారింది. ఒకచోటు అనకుండా దేశం నలుమూలల లైంగిక దోపిడీకి గురైంది. ఆమెతో పక్కను పంచుకునే విటులు మారే సంఖ్యకు లెక్కేలేదు. రోజుకు నలుగురు, ఐదుగురు, ఆరుగురు, ఒక్కోసారి పది మంది, ఒక్కోసారి క్యూలు కూడా ఉండేవట. అంతమందిని తట్టుకునేందుకు మద్యాన్నే కాదు, డ్రగ్స్‌ కూడా ఇచ్చేవారట. ఆ విషాదగాథ ఆమె మాటాల్లోనే...

15 ఏళ్లుగా.. కొన్ని వేలసార్లు రేప్...

15 ఏళ్లుగా.. కొన్ని వేలసార్లు రేప్...

ఈ 15 ఏళ్ల కాలంలో వేలాది మంది.. వేల వేలసార్లు రేప్‌ చేసి ఉంటారు. నన్ను ఊరూరా ఎత్తుకెళ్లి తిప్పిన ముఠాల్లో భారతీయులతోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్‌ దేశస్థులే ఎక్కువ. ఓ స్థానిక బ్రిటిష్‌ నాయకుడు కూడా ఉన్నారు. ఈ ముఠాలతో రాజకీయ నాయకులకు సంబంధం ఉండడం ఏమిటిని నేను ఆశ్చర్యపోయాను. సెక్స్‌ రాకెట్‌ ముఠా పట్టుపడిందనే వార్తలను అప్పుడప్పుడు పత్రికల్లో చూసేదాన్ని. 15,16 మందితో కూడిన ముఠా పట్టుపడినట్లు ఆ వార్తా కథనాల్లో ఉండేది. నిజానికి ఒక్కో ముఠాలో అంతకంటే ఎక్కువ మందే ఉంటారు. నాకు తెలిసి ఎప్పుడూ కూడా వారికి సరైన శిక్షలు పడేవి కావు.

 ఫొటోలు తీస్తానని వచ్చి.. రేప్ చేశాడు...

ఫొటోలు తీస్తానని వచ్చి.. రేప్ చేశాడు...

నాకు చిన్నతనం నుంచీ మోడలింగ్‌ అంటే ఇష్టం. నా తల్లిదండ్రులు కష్టజీవులు. వారికి శ్రమ తగ్గించడం కోసం వీలైనంత త్వరగా జీవితంలో స్థిరపడాలనుకున్నాను. ఓ రోజు మోడలింగ్‌ కోసం ప్రకటన చూసి ఫోన్‌ చేశాను. అవతలి వ్యక్తి ఇంటికొచ్చి ఫొటోలు తీస్తానని చెప్పాడు. నేను సరేనన్నాను. అప్పటికే పెళ్లి అయి పిల్లలున్న ఓ వ్యక్తి మా ఇంటికొచ్చాడు. ఆ సమయంలో నేను ఒక్కదానినే ఉన్నాను. ఫొటోలు తీస్తానని వచ్చిన వ్యక్తి అదే అదనుగా నన్ను భయపెట్టి, బెదిరించి నాపై అత్యాచారం చేశాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానన్నాడు. నేను నిజంగానే భయపడ్డాను. జరిగిన ఘోరాన్ని నాలోనే దిగమింగుకున్నాను.

హోటల్ గదిలో ముగ్గు రాక్షసులు..

హోటల్ గదిలో ముగ్గు రాక్షసులు..

నన్ను రేప్ చేసిన వ్యక్తి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేశాడు. ‘‘ఇంటికొస్తున్నాను.. బయటికెళ్దాం.. రెడీగా ఉండు..'' అని చెప్పాడు. నేను రానన్నాను. బెదిరించాడు. పోలీసులకు చెబుతానన్నాను. చెబితే చంపేస్తానన్నాడు. అంతే నాకు నోట మాట రాలేదు. అతను మా ఇంటికి వచ్చాడు. నన్ను బెదిరించి కారులో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ హోటల్‌ గదిలో ముగ్గురు రాక్షసులు కాచుకు కూర్చున్నారు. వారు మూకుమ్మడిగా నన్ను రేప్‌ చేశారు. అప్పటి నుంచి రోజూ నేను అత్యాచారానికి గురవుతూ వచ్చాను

నేను పేరుమోసిన వేశ్యనట...

నేను పేరుమోసిన వేశ్యనట...

నా బాధను ఏ రోజుకారోజు నా డైరీలో రాసుకునేదాన్ని. ఓ రోజున ఆ డైరీని మా అమ్మ చూసింది. విషయం అర్థమవగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ పోలీసు అధికారి వచ్చాడు. నాతో చాలా అసభ్యంగా మాట్లాడాడు. నా ఒంటిపై ఎక్కడ గిచ్చారు, ఎక్కడి గిల్లారు. ఎక్కడ కొరికారు చూపించంటూ భయపెట్టాడు. అదేమిటని ప్రశ్నిస్తే... రేపు కోర్టులో ఇలాగే అడుగుతారని, అక్కడ సరైన సమాధానం చెప్పడానికి ఇది ముందస్తు శిక్షణ అన్నాడు. ఆ తర్వాత ఆ పోలీసు అధికారి మా అమ్మ దగ్గరికెళ్లి.. ‘నీ కూతురు ఈ ప్రాంతంలో పేరుమోసిన వేశ్య..' అంటూ ఎగతాళిగా వెళ్లిపోయాడు.

జీవితం భయానకంగా మారింది...

జీవితం భయానకంగా మారింది...

ఆ తరువాత నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోనే వదిలేసి మరో ఇంటికి మారిపోయారు. కొంతకాలానికి నేనే హాస్టల్‌కు మారిపోయాను. అక్కడి నుంచి నా జీవితం మరింత భయానకంగా తయారయింది. బెదిరింపులు పెరిగాయి. విటుల దాడి పెరిగింది. వారి వికృత చేష్టలు పెరిగాయి. చివరకు లైంగిక జబ్బులు సోకడంతో నన్ను ముఠా సభ్యులు దూరంగా ఉంచారు. విటులు రావడం తగ్గి పోయింది. ఈ పరిస్థితుల్లోనే నేను పోలీసు స్టేషన్‌ కు వెళ్లి నాకు తెలిసిన మానవ అక్రమ రవాణా ముఠాల గురించి ఫిర్యాదు చేశాను. వాళ్లను గుర్తుపట్టడంలో పోలీసులకు సహకరిచాను.

జీవిత కథ.. పుస్తక రూపంగా..

జీవిత కథ.. పుస్తక రూపంగా..

మానవ అక్రమ రవాణా ముఠా కేసుల్లో తొలుత ఆమెను లండన్‌ పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా చేర్చారు. అయితే ఆమెకు మతిపరుపు పెరగడం, ఒకసారి చెప్పినదానికి, మరోసారి చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో ఆమెను సాక్షిగా తొలగించారు. ఆ తర్వాత ఆమె ఓ పబ్లిషర్‌ సాయంతో స్థిరపడి తన జీవిత కథను పుస్తకంగా రాశారు. ‘ప్లీజ్‌ లెట్‌ మీ గో' అనే పేరుతో ఇప్పుడు ఆ పుస్తకం మార్కెట్‌లోకి వచ్చింది. అంతర్జాతీయ కార్మిక సంఘంతో కలసి సర్వే నిర్వహించిన ‘వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌' అనే సంస్థ ఇటీవల ఓ నివేదికలో కొన్ని విషయాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది బానిసలుగా పనిచేస్తుంటే వారిలో 90 శాతం మంది మహిళలేనట. వారిలో కూడా అత్యధికులు బాలికలేనని, వారిలో 99 శాతం మంది సెక్స్‌ బానిసలుగా పనిచేస్తున్నారని, మానవ అక్రమ రవాణా ముఠాల కారణంగానే వారు బానిసలుగా మారుతున్నారని తన నివేదికలో పేర్కొంది.

English summary
Please, Let Me Go tells the shocking true story of Caitlin Spencer, a survivor of sex trafficking in England. From the age of 14, Caitlin was completely controlled, repeatedly raped, provided with alcohol, given drugs, sold and passed on to new gangs over and over again. The majority of her abusers were Pakistani men, who were blatant in their attacks upon her, often collecting her from school or home, to be taken to flats they owned, family homes, or hotels booked for the day, to be horrifically and systematically abused. At a time when the abuse ring realities of young white women in Rotherham and other major English cities are coming to light, Caitlin's story will appal readers - not just because of the degree of horrific attacks which were perpetrated upon her, but also because of the ways in which the authorities refused to act. Caitlin speaks openly about what she has suffered, and also shows just how unwilling many people are to face up to what is happening in our midst, for fear of being called racist. By bravely speaking out, she will, hopefully prove just how deep these problems are and just how the abusers get away with it in plain sight of the authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X