వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ లో సుఖానుభూతి దైవిక‌మైన‌ది - భోజనం కూడా అలాంటిదే: పోప్ ఫ్రాన్సిస్ - నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా

|
Google Oneindia TeluguNews

''ప్రతి మనిషి ఇష్టమైన ఆహారాన్ని కడుపునిండా తినడం ద్వారానో, ఇష్టమైన వ్యక్తితో శారీరక కలయిక ద్వారానో సుఖసంతోషాలు అనుభవించడం పాపం కానేకాదు. నిజం చెప్పాలంటే, సెక్స్ ద్వారా, మంచి భోజనం ద్వారా మనుషులు పొందే సుఖానుభూతి దివ్య‌మైన‌దేకాదు.. దైవిక సంబంధ‌మైన‌ది కూడా'' అని తడుముకోకుండా చెప్పేశారు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్.

కొడాలి నాని బాతుబచ్చా అన్నట్లేగా - జగన్ భార్యను వంశీ ఏమన్నాడో గుర్తులేదా?: దివ్వవాణి ఫైర్కొడాలి నాని బాతుబచ్చా అన్నట్లేగా - జగన్ భార్యను వంశీ ఏమన్నాడో గుర్తులేదా?: దివ్వవాణి ఫైర్

పుస్తకంగా పోత్‌తో సంభాషణలు..

పుస్తకంగా పోత్‌తో సంభాషణలు..

సెక్స్, భోజనంలో సంతృప్తి, చర్చిల్లో అతి నైతికత అంశాలపై పోప్ ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలు కొత్తవేమీకావు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో, వ్యక్తులతో సంభాషణలో ఆయన వెల్లడించిన అభిప్రాయాలే ఇవి. ఇటలీకి చెందిన ప్రఖ్యాత రచయిత, యాక్టివిస్ట్ కార్లో ప్రెటినీ.. పోప్ ఫ్రాన్సిస్ తో తాను జరిపిన సంభాషణలు, వివిధ సందర్భాల్లో పోప్ వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి పుస్తకంగా మలచారు. కార్లో ప్రెటినీ రాసిన ‘‘టెర్రాఫుతురా''(సమానార్థంలో ‘భూగోళం భవిష్యత్తు') పుస్తకం బుధవారం విడుదలైంది. అందులో పోప్ వెల్లడించిన అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

వ్యాక్సిన్ గుడ్‌న్యూస్: ఈ ఏడాదిలోనే - ఆస్ట్రాజెనెకా అనూహ్య ప్రకటన - ట్రయల్స్ నిలిపేతపై సీఈవో వివరణవ్యాక్సిన్ గుడ్‌న్యూస్: ఈ ఏడాదిలోనే - ఆస్ట్రాజెనెకా అనూహ్య ప్రకటన - ట్రయల్స్ నిలిపేతపై సీఈవో వివరణ

చ‌ర్చిల్లో అతి నైతిక‌త..

చ‌ర్చిల్లో అతి నైతిక‌త..

‘‘రుచిక‌ర‌మైన ఆహారం, ఇష్ట‌మైనవారితో లైంగిక సంప‌ర్కంతో సుఖం పొందడమనేది దైవిక‌మైన‌వే. గ‌తంలో చర్చిల్లో ఉండే అతి నైతికత కారణంగా అలాంటి సుఖాల‌ను కోరుకునేవాళ్లను అన్యాయంగా బాధితుల‌య్యారు. సుఖ‌మైనా, సంతోష‌మైనా నేరుగా దైవం నుంచే ల‌భిస్తుంది. అది క్యాథ‌లిజ‌మో, క్రిస్టియానిటీనో, మ‌రొక‌టో కాదు. కేవ‌లం దివ్య‌త్వం. బాధ్యత కలిగిన చర్చి వ్యవస్థ.. అసహజమైన, అమాన‌వీయ‌మైన‌, క్రూర‌మైన‌ సుఖాల‌ను కచ్చితంగా ఖండిస్తుంది. కానీ అదే సమయంలో సహజమైన, మానీవీయ‌మైన‌, నైతిక‌మైన సుఖాల‌ను మాత్రం తప్పకుండా అంగీక‌రిస్తుంది'' అని పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన మాటలను రచయిత కార్లో ప్రెటినీ తన పుస్తకంలో పొందుపర్చారు.

వాటికన్ సరిహద్దుల విస్తరణ..

వాటికన్ సరిహద్దుల విస్తరణ..

రోమన్ క్యాథ‌లిజానికి, క్రైస్తవ మతానికి ప్రతినిధిగా భావించే పోప్ పదవిని చేపట్టిన తొలి నాన్ యురోపియన్ గా పోప్ ఫ్రాన్సిస్ రికార్డులకెక్కారు. లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనా ఆయన స్వస్థలం. 2013లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పోప్ వ్యవస్థను సమూలంగా మార్చేశారు. అప్పటివరకు కొనసాగిన పోప్ లకు భిన్నంగా.. సాధారణ ప్రజలకు మరింత దగ్గరవుతూ వాటికన్ సిటీ సరిహద్దులను విస్తరించుకుంటూ పోయారు. టర్కీ, యూఏఈ పర్యటనలో ముస్లిం మతగురువులతో కలిసి నమాజ్ చేయడం, ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి స్థానిక మతాచారాలను పాటిస్తూ ప్రార్థనలు చేయడం పోప్ ఫ్రాన్సిస్ విశిష్టతను రెట్టింపు చేసింది. ఇదిలాఉంటే,

నెట్ ఫ్లిక్స్‌‌లో పోప్ సినిమా..

నెట్ ఫ్లిక్స్‌‌లో పోప్ సినిమా..

సాధారణంగా పోప్ గా ఎన్నికైన వ్యక్తి.. చనిపోయే వరకూ ఆ పదవిలోనే కొనసాగుతారు. కానీ 2013లో పోప్ బెనడిక్ట్-16 తన పదవికి రాజీనామా చేసిన అనూహ్య పరిణామాల మధ్య ఫ్రాన్సిస్ తదుపరి పోప్ గా ఎన్నికయ్యారు. యూరప్ సహా ఇతర ఖండాల్లోని క్యాథలిక్ చర్చిల్లో మతగురువుల అనైతిక కలాపాలు, వాటికన్ సిటీలోనూ అకృత్యాలు వెలుగులోకి రావడంతో అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. ఆ పరిస్థితుల్లో తాను పోప్ గా కొనసాగలేనంటూ బెనడిక్ట్ పదవి నుంచి తప్పుకుంటారు. మనిషి కోణం నుంచి దేవుణ్ని చూసే విషయంలో భిన్నధృవాలైన బెనడిక్ట్, ఫ్రాన్సిస్ లు ఆ గడ్డు పరిస్థితిని ఎలా అధిగమిస్తారు? పోప్ అంటే దైవాంశసంభూతుడు కాదు.. ప్రజల మనిషి అని ఫ్రాన్సిస్ నమ్మడానికి దారితీసిన పరిణామాలేంటి? ఆయన వ్యక్తిగత జీవితం ఎలా సాగింది? అనే సమగ్ర విషయాలను ‘‘ది టు పోప్స్'' పేరుతో వచ్చిన బయోగ్రఫీలో సవివరంగా చూపించారు. గతేడాది నవంబర్ లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కార్లో ప్రెటినీ తాజా పుస్తకం విడుదలైన నేపథ్యంలో ‘ది టు పోప్స్' సినిమాను చూస్తోన్నవాళ్ల సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది.

English summary
The pleasures of a well-cooked meal or loving sexual intercourse are "divine" and have unjustly fallen victim to "overzealousness" on the part of the Church in the past, Pope Francis says in a book of interviews published Wednesday. "Pleasure arrives directly from God, it is neither Catholic, nor Christian, nor anything else, it is simply divine," Francis told Italian writer and gourmet Carlo Petrini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X