వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభినందన్ విడుదలకు ఇమ్రాన్ నిర్ణయంపై ఆయన భార్య, మాజీ భార్య ఏమన్నారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

గత కొద్దిరోజులుగా భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా దాడులకు ప్రతీకారంగా భారత వాయుసేన పాక్ గగనతలంలోకి చొచ్చుకువెళ్లి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి తిరిగి భారత్‌కు చేరుకుంది. ఆ తర్వాత బుధవారం రోజున పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించి దాడులకు యత్నించడంతో భారత వాయుసేన తిప్పికొట్టింది. అదేసమయంలో భారత్‌కు చెందిన ఓ యుద్ధ విమానంను పాక్ వదిలిన క్షిపణి ఢీకొట్టడంతో అందులోని పైలట్ అభినందన్ సింగ్ పాక్ భూభాగంపై ల్యాండ్ అయ్యాడు. ఈ క్రమంలో పాక్ తనను యుద్ధ ఖైధీగా పట్టుకుంది. ఇక పాకిస్తాన్ పై అతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. భారత్‌తో తాము శాంతిని కోరుకుంటున్నట్లు తెలిపిన ఇమ్రాన్ ఖాన్... ఇందులో భాగంగానే పట్టుబడిన పైలట్ అభినందన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. పాక్ ప్రధాని నిర్ణయంపై ఆయన భార్య మాజీ భార్య స్పందించారు.

PM Imran Khan’s former wives praise him for ‘peace gesture’

భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధన్‌ను విడుదల చేయాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాన్ని ఆయన భార్య రేహమ్ ఖాన్, మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్‌లు స్వాగతించారు. ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. జెనీవా కన్వెన్షన్ ప్రకారమే పైలట్ అభినందన్‌ను విడుదల చేయాల్సి వస్తోందని చెప్పిన ఆమె... ఇమ్రాన్‌ఖాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ట్విటర్ వేదికగా పోస్టు చేశారు.

మరో వైపు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్ కూడా హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం ఇమ్రాన్ ఖాన్ తీసుకున్నారని అర్థం వచ్చేలా చప్పట్ల సింబల్‌ను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ వింగ్ కమాండర్ అభినందన్ పైలట్‌ను శుక్రవారం సాయంత్రం పాకిస్తాన్ విడుదల చేసే అవకాశం ఉంది. అన్ని నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారమే అభినందన్ వర్ధమాన్ విడుదల అవుతారు. అయితే అభినందన్ విడుదల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది... చర్చలా లేదా యుద్ధమా అనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

English summary
Prime Minister Imran Khan’s former wives Jemima Goldsmith and Reham Khan praised him on Thursday for his ‘gesture of peace’ towards India.The prime minister won praise from all quarters in India and Pakistan for the gesture. His former wives Jemima Goldsmith and Reham Khan were no different as they lauded his gesture as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X