వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ వర్సెస్ ఇమ్రాన్ ఇద్దరూ: ఒకే వేదిక మీదకు: ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi And Imran Khan To Clash At UNO Today || ఐక్యరాజ్యసమితి వేదిగ్గా మోదీ,ఇమ్రాన్ ప్రసంగం

ప్రధాని మోదీ..పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ చాలా కాలం తరువాత ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా వీరిద్దరూ మాట్లాడనున్నారు. జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్థాన్ ప్రధాని భారత నిర్ణయపైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. భారత్ సైతం ఆ వ్యాఖ్యలను తిప్పి కొట్టింది. ఇదే సమయంలో భాతర్..పాకిస్థాన్ దేశాలకు మధ్య వర్తిత్వం వహించటానికి సిద్దమని తొలుత ప్రకటించిన అమెరికా అధినేత ట్రంప్ ఆ తరువాత ఆ వ్యాఖ్యలను సరి దిద్దుకున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో కాశ్మీర్ సమస్య పరిష్కరించుకొనే సత్తా మోదీకి ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పదే పదే ఉగ్రవాదం నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ దేశాలు మొత్తం ఉగ్రవాదం మీద కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఉగ్రవాదం నిర్మూలనలో మోదీ సూచనలను గౌరవిస్తామని స్పష్టం చేసారు. అమెరికా కేంద్రంగా సాగుతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదిక మీద ఇమ్రాన్ సమక్షంలో మోదీ ఏం మాట్లాడుతారు..ఆ తరువాత మాట్లాడే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఏ రకంగా స్పందిస్తానేది ఇప్పుడు యావత్ ఆసక్తి కరంగా మారింది.

యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా..

యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా..

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా భారత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం ముగిసిన తరువాత పాక్ ప్రధాని ఇమ్రాన్ మాట్లాడనున్నారు. శుక్రవారం వీరిద్దరి ప్రసంగాలు ఉండే అవకాశం ఉంది. ప్రధాని మోదీ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా ఉగ్రవాదం..శాంతి..డెవలప్ మెంట్ గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. అదే విధంగా ఉగ్రవాద నిర్మూలనలో భారత్ తీసుకుంటున్న చర్యలు .. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాల విషయంలోనూ మోదీ ప్రస్తావించే అవకాశం ఉంది. మోదీ ప్రసంగం ముగిసిన తరువాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రసంగించనున్నారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు

అయితే, జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్.. పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సార్క్ సమావేశంలోనూ భారత విదేశాంగ మంత్రితో కలిసి చర్చలు చేయటానికి పాకిస్తాన్ నిరాకరించింది. కాశ్మీర్ అంశంలో భారత్ తీరు కు నిరసనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి ప్రకటించారు. అయితే భారత్ మాత్రం తమ వైఖరి స్పష్టంగా ప్రకటించింది. కాశ్మీర్ అంశం పూర్తిగా తమ అంతర్గత విషయమని..ఇందులో ఎవరి జోక్యం..ప్రమేయం అవసరం లేదని తేల్చి చెబుతోంది. పాకిస్థాన్ మాత్రం ఈ అంశాన్ని అంతర్జాతీయ విషయంగా మార్చే ప్రయత్నం చేస్తోంది.

ట్రంప్ తో ఇద్దరు ప్రధానుల సమావేశం..

ట్రంప్ తో ఇద్దరు ప్రధానుల సమావేశం..

ప్రధాని మోదీతో సమావేశమైన సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. టెర్రరిజాన్ని అదుపు చేసేందుకు..పొరుగు దేశ ప్రోత్సాహాన్ని అడ్డుకొనేందుకు మోదీ చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. భారత్ తో తాము త్వరలోనే వాణిజ్య పరంగా ఒప్పందాలు చేసుకుంటామని..భారత్ తమకు మిత్ర దేశమని స్పష్టం చేసారు. అదే విధంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ సైతం ట్రంప్ తో సమావేశమయ్యారు. తాము భారత్..ఇరాన్..ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సాయం అందించాలని కోరారు.

ఇమ్రాన్‌ ప్రయత్నాలకు గండి

ఇమ్రాన్‌ ప్రయత్నాలకు గండి

ఇక కాశ్మీర్ అంశంలో ట్రంప్ మద్దతు కోరేందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా..భారత్ అనుమతి..అంగీకారం లేకుండా ఎటువంటి హామీ ఇచ్చేందుకు..వ్యాఖ్యలు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్దంగా లేరన్నది స్పష్టం అవుతోంది. దీంతో..ఇప్పుడు కాశ్మీర్ నిర్ణయం తరువాత తొలి సారి ఐక్యరాజ్య సమితి వేదికగా కలవటం.. అక్కడ ప్రసంగించటం ద్వారా ఏం జరగుబోతోందనే ఆసక్తి నెలకొని ఉంది.

English summary
Both PM Modi and Imran Khan are scheduled to address the 74th UNGA session on Friday.New York might witness a rare scene when the leader of the two rival countries India and Pakistan will address the same platform, one after the other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X