వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాల్గోసారి లంక ప్రధానిగా రనిల్, మోడీ అభినందన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధానిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన రనిల్ విక్రమ్ సింఘే(66)కు భారత ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. నాలుగోసారి శ్రీలంక ప్రధానిగా ఆయన శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

రనిల్ విక్రమ్ సింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌సీ) సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 106 స్ధానాలు గెలుచుకుంది. మాజీ అధ్యక్షుడు, ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న మహేంద్ర రాజపక్సే తుది ఫలితాలు వెలువడక ముందే ఓటమిని అంగీకరించిన సంగతి తెలిసిందే.

PM Modi Congratulates Lankan Counterpart Wickremesinghe on Poll Win

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ పీపుల్స్ ప్రీడం ఆలయన్స్ (యూపీఎఫ్ఏ) 95 స్ధానాలను గెలుచుకుని రెండో స్ధానంలో నిలిచింది. 225 స్ధానాలు కలిగిన శ్రీలంక పార్లమెంట్లో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీకి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. తమిళ పార్టీల మద్దతు విక్రమ్ సింఘే నాల్గోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

విక్రమ్ సింఘే మళ్లీ ప్రధాని కాబోతున్నారని తెలుసుకున్న భారత ప్రధాని మోడీ బుధవారమే ఫోన్ చేసి అభినందించారు. ఆయన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు మరితంగా బలోపేతం అవుతాయని ట్వీట్ చేశారు.

English summary
Prime Minister Narendra Modi today congratulated Ranil Wickremesinghe on being sworn-in as Sri Lanka's Prime Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X