వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుల్లెట్ ట్రైన్‌కు జపాన్ ఆర్థిక సాయం .. షింజో తమ పాత స్నేహితుడన్న మోడీ

|
Google Oneindia TeluguNews

ఒసాకా : భారతదేశానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని జపాన్ తెలిపింది. జీ-20 సదస్సు జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీతో జపాన్ ప్రధాని షింజో అబే చర్చించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు సహకారం అందించాలని మోడీ కోరగా .. జపాన్ సుముఖత వ్యక్తం చేసింది.

బుల్లెట్ ట్రైన్‌కు బాసట ..
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు జరుగుతుంది. దీనికి వారణాసి కన్వెక్షన్ చేస్తూ మార్పు చేశారు. ప్రాజెక్టుకు సహకారం అందించేందుకు పాత స్నేహితుడు షింజో అబే అంగీకరించామని మోడీ పేర్కొన్నారు. దీనికి సంబంధించి జపాన్ రూ.79 వేల కోట్ల రుణం భారత్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. జపాన్ సహకారంతో 2022లో బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కుతుందని మోడీ పేర్కొన్నారు. వారణాసి మరియు క్యోటో మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌కు జపాన్ భారత్‌కు సుమారు రూ .200 కోట్లు ఇచ్చింది. 2015లో మోడీ, అబే కలిసి వారణాసిని సందర్శించినప్పుడు ఈ ఒప్పందం జరిగింది.

PM Modi discusses bullet train, Varanasi with Japan

నేరస్తులపై ఉక్కుపాదం ...
బుల్లెట్ రైలు కోసం ఆర్థిక సహకారంతోపాటు .. ఆర్థిక నేరస్తులను అప్పగించేందుకు కూడా సహకారం అందిస్తామని జపాన్ భరోసా కల్పించింది. ఇవాళ కీలక అంశాలపై షింజో అబేతో మోడీ చర్చించారు. రేపు ట్రంప్, మోడీలతో కూడా వివిధ అంశాలపై డిస్కస్ చేస్తారు అబే. ముఖ్యంగా ఇండో ఫసిఫిక్ రీజియన్‌లో అనుసరించాల్సిన వ్యుహంపై మూడుదేశాల అధినేతల మధ్య ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాదు రెండోసారి మోడీ విజయం సాధించాక .. తొలిసారి ఫోన్ చేసి అభినందించింది షింబో అబేనే. ఈ విషయాన్ని మోడీ ప్రత్యేకంగా గుర్తుచేశారు.

English summary
started his G20 visit with wide-ranging discussions on bilateral matters - including the Mumbai-Ahmedabad bullet train project and the Varanasi convention centre being built with Japanese cooperation-- with ‘old friend’ Japanese PM Shinzo Abe. Japan has granted India a soft loan of Rs 79,000 crore for India’s first bullet train modeled on Japan’s Shinkansen trains. One of the most ambitious infrastructure projects carried out with Japanese cooperation is due for 2022 launch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X