వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నత శిఖరాలకు సంబంధాలు: మోడీ, భారత్ రావాలని హ్యారిస్‌కు ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోడీ- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వివిధ అంశాలపై డిస్కస్ చేశారు. అగ్రరాజ్య వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించిన హ్యారిస్‌కు మోడీ అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో ఈ సారి జరిగిన ఎన్నిక అత్యంత ముఖ్యమైనవని తెలిపారు. అలాగే త్వరలో భారత్ రావాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. ద్వైపాక్షిక చర్చలు జరిపే ముందు ఇరువురు నేతలు మీడియాతో ముచ్చటించారు.

ఇక ఇరువురు నేతలు ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్‌మెంట్స్ గురించి చర్చించుకున్నారు. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం వంటి అంశాలు, ఇండో పసఫిక్ ప్రాంతంలో చైనా దురాగతాలను ఈ సందర్భంగా చర్చించారు. ఇక కరోనా పరిస్థితిపై కూడా కమలా హ్యారిస్ - మోదీ చర్చించారు. భారత్‌లో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై హ్యారిస్‌కు ప్రధాని మోదీ వివరించారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు. అంతేకాదు అత్యంత అవసరమైన మెడిసిన్స్ కూడా వెంటనే అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పిన ప్రధాని మోదీ... ఆరోగ్య వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇక వాతావరణ మార్పులపై కూడా ప్రధాని మోదీ చర్చించారు. పునరుత్పాదక శక్తి వినియోగంను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన ప్రధాని మోదీ.. ఈ మధ్యనే నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పర్యావరణ సుస్థిరత సాధనకు జీవనశైలిలో మార్పు రావాలని ప్రధాని అన్నారు. భవిష్యత్తులో భారత్ అమెరికా కలిసి పనిచేయడం, ముఖ్యంగా అంతరిక్ష రంగం, ఐటీ రంగాల్లో కలిసి ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒక అవగాహనకు వచ్చారు. ఆరోగ్య రంగంలో కూడా పరస్పర సహకార ధోరణితో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

ప్రపంచంలో మిగతా వారికి ఆదర్శంగా నిలిచారని కమలా హ్యారిస్‌ను మోడీ ప్రశంసించారు. అధ్యక్షులు బైడెన్, హ్యారిస్ నేతృత్వంలో ఇరుదేశాల సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నారని.. భారత్ రావాలని కమలా హ్యారిస్‌ను కోరారు. కరోనా సమయంలో ఇరువురు ఫోన్‌లో మాట్లాడుకోగా.. ఆ తర్వాత తొలిసారి కలిసి.. కీలక అంశాలపై డిస్కష్ చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య 4 మిలియన్ల మంది భారత ఎన్ఆర్ఐలు బ్రిడ్జీ మాదిరిగా అనుసంధానం చేస్తున్నారని మోడీ అభిప్రాయపడ్డారు. కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన మహిళ అనే సంగతి తెలిసిందే.

 PM modi Invites Kamala Harris To India

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో మోడీ వెల్లడించారు.

Recommended Video

విపక్షాల మహా ధర్నాకు కదిలివచ్చిన వివిధ పార్టీల నాయకులు!!

ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.

English summary
people of India are waiting to welcome you. I extend to you an invitation to visit India PM Modi asks us vice president Kamala Harris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X