వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

సీఈవోలతో మీట్ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో సమావేశం అయ్యారు. వాషింగ్టన్ డీసీలో కొనసాగుతోన్న సమావేశంలో.. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుగుతుంది. వర్తక, వాణిజ్యం, సరిహద్దు భద్రతపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రధాని మోడీ మీట్ అవుతారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో మోడీ వెల్లడించారు.

 PM Modi meets Australian PM Scott Morrison

ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు.

ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.

Recommended Video

విపక్షాల మహా ధర్నాకు కదిలివచ్చిన వివిధ పార్టీల నాయకులు!!

అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్తాన్‌ అనుమతించింది. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళితే తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాక్‌ నిరాకరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాక్‌ ధోరణిపై భారత్‌ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌లో తన నిరసన గళాన్ని వినిపించింది. అఫ్గానిస్తాన్‌ గగనతలం సురక్షితం కాదు కాబట్టి ఈసారి ప్రధాని మోడీ విమానానికి పాక్‌ అనుమతించింది.

English summary
Prime Minister Narendra Modi has started the bilateral meeting with Australian PM Scott Morrison in Washington. They are likely to speak about issues related to trade and maritime security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X