వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ సౌదీ పర్యటన: కీలక రంగాల్లో డజనుకుపైగా ఒప్పందాలపై సంతకాలు

|
Google Oneindia TeluguNews

రియాద్ : సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధినాయకత్వంతో మంగళవారం భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య పలు ప్రాధాన్యత అంశాల సమన్వయం కోసం వ్యూహాత్మక భాగస్వాముల సమాఖ్యను ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా రెండు దేశాలు కీలక రంగాల్లో డజనుకు పైగా ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సౌదీ మద్దతు

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సౌదీ మద్దతు

ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రభుత్వంతో పలు అంశాలపై చర్చించిన మోడీ... ఆ తర్వాత ఇరుదేశాలు ఆయిల్, గ్యాస్, రక్షణశాఖ, పౌరవిమానాయానశాఖ రంగాల్లో డజనుకుపైగా ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం మోడీ సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌తో చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఇరుదేశాలు భావించి ఆదిశగా భద్రతా సహకారంపై ఒప్పందాలు చేసుకున్నాయి. పాకిస్తాన్‌కు ముఖ్యబాగస్వామిగా ఉన్న సౌదీ అరేబియా ఉగ్రవాదంను అణిచివేసేందుకు భారత్‌తో కలిసి నడుస్తామని పేర్కొంది.

వ్యూహాత్మక భాగస్వామి సమాఖ్య ఏర్పాటు

వ్యూహాత్మక భాగస్వామి సమాఖ్య ఏర్పాటు

ఇక ఇరుదేశాల ప్రభుత్వ చర్చలు ముగిసిన తర్వాత వ్యూహాత్మక భాగస్వామి సమాఖ్య ఏర్పాటుకు సంబంధించి రెండు దేశాలు సంతకాలు చేశాయి. ప్రతి రెండేళ్లకు ఓసారి రెండు దేశాధినేతలు భేటీ అయి పలు అంశాలపై చర్చిస్తారు. మోడీ సౌదీ యువరాజు సల్మాన్ నేతృత్వంలో ఈ సమాఖ్య జరుగుతుంది. ఈ-మైగ్రేషన్ విధానంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ఇక సౌదీలో రూపే కార్డులు చెల్లుబాటు అయ్యేలా మరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతకుముందు భారత్ తన డిజిటల్ పేమెంట్లు చెల్లుబాటు అయ్యేలా యూఏఈ, బహ్రెయిన్ దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు దేశాల మధ్య రక్షణశాఖ పరిశ్రమ బలోపేతంపై సంతకాలు జరిగాయి అదే సమయంలో భద్రతా సహకారంపై కూడా ఒప్పందం జరిగాయి. రెండు దేశాల మధ్య సంయుక్త నేవీ విన్యాసాలు ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది మొదట్లో కానీ జరుగుతాయని తెలుస్తోంది.

భారత్‌కు ఆయిల్ సప్లై చేస్తున్న దేశాల్లో రెండో అతిపెద్ద దేశం సౌదీ

భారత్‌కు ఆయిల్ సప్లై చేస్తున్న దేశాల్లో రెండో అతిపెద్ద దేశం సౌదీ

ఇండియన్ ఆయిల్ మిడిల్ ఈస్ట్ సౌదీ ఆయిల్ సంస్థ ఆల్ జెరీలు కలిసి సౌదీ అరేబియాలో ఇంధనం రీటెయిల్ బిజినెస్ ఏర్పాటుకు ఎంఓయూ జరిగింది. ఆయిల్ వినియోగంలో మూడో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్... ఏటా 83శాతం ఆయిల్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇరాక్ నుంచి అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుండగా... ఆ తర్వాత భారత్‌కు అత్యధికంగా ఆయిల్‌ సప్లై చేసే దేశంగా సౌదీ అరేబియా ఉంది. ప్రతినెలా 200,000టన్నుల ఎల్పీజీని సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేస్తుంది భారత్.

సౌదీ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు

సౌదీ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు


సౌదీ అరేబియా ప్రధాన ఆయిల్ సంస్థపై ఇరాక్ దాడులు చేయగా అది ధ్వంసమైనప్పటికీ భారత అవసరాల మేరకు ఆయిల్ సప్లై చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని భారత ప్రభుత్వ ప్రతినిధి తిరుమూర్తి చెప్పారు. ఇక రెండు దేశాల మధ్య విమానాల సంఖ్య పెంపుపై కూడా సంతకాలు జరిగాయి. ఎనర్జీ రంగంలో ఇరుదేశాలు గత కొన్నేళ్లలో మంచి స్వింగ్ మీద ఉన్నాయి. ఈ రంగంలో పురోగతిని సాధించేందుకు ఒప్పందాలు జరిగాయి.

English summary
Prime Minister Narendra Modi on Tuesday held extensive talks with the Saudi Arabia's top leadership during which a Strategic Partnership Council was established to coordinate on important issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X