వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిన్‌పింగ్‌కతో నరేంద్ర మోడీ భేటీ: వాటిపై నిలదీయాలని రాహుల్ గాంధీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ భేటీ అయ్యారు. గురువారం రాత్రి హుబెయ్ ప్రావిన్స్ రాజధాని వుహాన్ చేరుకున్న మోడీ అక్కడ బస చేశారు. శుక్రవారం హుబెయ్ పురావస్తుశాలలో ఇరువురు దేశాధినేతలు కలుసుకున్నారు.

మ్యూజియం చేరుకున్న ప్రధాని మోడీతో జీ జిన్‌పింగ్ కరచాలనం చేసి సాదరంగా ఆహ్వానించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో మోడీకి ఆహ్వానం పలికారు. అనంతరం ఇరువురు మ్యూజియంను సందర్శించారు.

PM Narendra Modi meets Xi Jinping at Maos favourite holiday spot in Wuhan

ఇరువురు నేతలకు ప్రముఖ ఈస్ట్ లేక్ వద్ద విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం చైనా విప్లవ నేత మావో జెడాంగ్‌కు ఇష్టమైన ప్రాంతం. శనివారం ఉదయం ఇదే ప్రదేశంలో యాంగ్తే నదీతీరాన నడిచి, పడవలో విహరించి, మధ్యాహ్నం విందుతో భేటీ ముగిస్తారు.

మోడీ పర్యటనపై రాహుల్ గాంధీ

చైనా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సూచన చేశారు. చైనాతో డొక్లామ్, చైనా - పాకిస్తాన్ ఎకో కారిడార్ వంటి అంశాలను ఈ పర్యటనలో ప్రస్తావించాలని భారత్ కోరుకుంటోందని రాహుల్ పేర్కొన్నారు. మీకు మా మద్దతు ఉంటుందని తెలిపారు. చైనా పర్యటనలో ఉన్న మోడీని ఉద్దేశించి డొక్లామ్ వంటి సమస్యలు ఉన్నాయని, వాటిపై గట్టి హెచ్చరికలు చైనాకు ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు.

English summary
Narendra Modi and Xi Jinping hold delegation level talks in Hubei, PM thanks Jinping for 'grand welcome'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X