వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధమని కవ్విస్తే.. శాంతి అని ఊరుకోం.. తగిన బుద్ధి చెబుతాం.. పాక్‌కు మోడీ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

మహాత్మా గాంధీ మార్గం నేటికి అనుచరణీయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గాంధీ 150వ జయంతి అక్టోబర్ 2న జరుపుకోబోతున్నామని స్మరించారు. కాసేపటి క్రితం ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ అని మోడీ స్పష్టంచేశారు.

130 కోట్ల మంది ప్రజల తరపున

130 కోట్ల మంది ప్రజల తరపున

ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు, సభ్యదేశాల అధినేతలకు ధన్యవాదాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. తాను 130 కోట్ల మంది ప్రజల తరఫున మాట్లాడుతున్నా అని పేర్కొన్నారు. తన ప్రభుత్వాన్ని రెండోసారి ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్లాస్టిక్ నిర్మూలన కోసం నడుం బిగించామని తెలిపారు. నదుల అనుసంధానం కోసం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 2025 నాటికి దేశాన్ని టీవీ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2022 నాటికి 2 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తేల్చిచెప్పారు.

టీబీ నిర్మూలన

టీబీ నిర్మూలన

2025 నాటికి టీబీని నిర్మూలిస్తామని స్పష్టంచేశారు. భారత్‌లో పురాతన ధర్మం అమల్లో ఉందని గుర్తుచేశారు. దేశంలో ప్రతీ ఒక్కరిని దేవుడిని చూస్తామన్నారు. జన కల్యాణ్ నుంచి జగత్ కల్యాణం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధి అని స్పష్టంచేశారు. మేం చేస్తోన్న ప్రయత్నాలు.. ప్రజలను ఉద్దేశించి చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు.

సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని

130 కోట్ల ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మోడీ తెలిపారు. 3 వేళ ఎళ్ల క్రితం కల్యాణ్ అనే కవి.. భారత్ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారనే విషయాన్ని చెప్పారు. దేశంలో చేసే పనులు ప్రపంచక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తారని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు.

శాంతి విధానం.. కానీ...

శాంతి విధానం.. కానీ...

ప్రపంచశాంతి కోసం పాటుపడుతున్నామని మోడీ పేర్కొన్నారు. తమది యుద్ధ విధానం కాదని తెలిపారు. గత కొంతకాలంగా పాకిస్థాన్‌తో యుద్ధమేఘాలు కమ్ముకొన్న క్రమంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు శాంతి అంటూ చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. తాము మాత్రం ప్రపంచశాంతి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే దౌత్యపరంగా పరిష్కరించుకుంటామని తమ వాదనను ఐక్యరాజ్యసమితిలో మోడీ బలంగా వినిపించారు.

English summary
PM NarendraModi address the UN General Assembly session
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X