వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలార్ వోర్టెక్స్: చలికి గడ్డకట్టిన అమెరికా, చికాగోలో రికార్డ్‌స్థాయిలో చలిగాలులు

|
Google Oneindia TeluguNews

చికాగో: అమెరికాలోని చికాగో చిగురుటాకులా వణికిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి విపరీతంగా చలిగాలులు వీస్తున్నాయి. చలిగాలుల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలిగాలుల కారణంగా అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతం గడ్డకట్టుకుపోతోంది. మధ్య పశ్చిమ రాష్ట్రాలు ఎమర్జెన్సీని విధించాయి. దాదాపు ఆరుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

మిచిగాన్, విస్కిన్‌సన్, ఇల్లినాయిస్ రాష్ట్రాలలో అత్యయిక పరిస్థితి కొనసాగుతోంది. బయటకు వెళ్లేవాళ్లు డీప్ బ్రీత్ తీసుకొవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలార్ వోర్డెక్స్ ప్రభావం కారణంగా ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ నుంచి వస్తున్న తీవ్ర చలిగాలులతో అమెరికా పశ్చిమ మధ్య (మిడ్ వెస్ట్) ప్రాంతం హిమఖండంలా మారింది. దీంతో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మొత్తానికి ఈ ప్రభావం కోట్లాది మందిపై చూపుతోంది.

 మైనస్ పది డిగ్రీల నుంచి మైనస్ 40 సెల్సియస్ డిగ్రీల వరకు

మైనస్ పది డిగ్రీల నుంచి మైనస్ 40 సెల్సియస్ డిగ్రీల వరకు

డకోటా నుంచి ఓహియో వరకు పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. గతంలో ఎన్నడు లేని చలి గజగజ వణికిస్తోంది. చికాగోతో పాటు పలు ప్రాంతాల్లో మైనస్ 27 డిగ్రల సెల్సియస్, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదయింది. చలులు మరింత విస్తరించే అంచనాతో అధికారులు పాఠశాలలతో పాటు కార్యాలయాలను, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. పోస్టల్ సర్వీసులతో పాటు వందల విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్లలోనే ఉండాలని సూచించాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మైనస్ పది డిగ్రీల నుంచి మైనస్ 40 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయింది.

 చికాగోలో చలి అంటార్కిటికా కంటే తీవ్రంగా

చికాగోలో చలి అంటార్కిటికా కంటే తీవ్రంగా

మిన్నెసోటాలో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. చికాగోలో చలి అంటార్కిటికాలోని పలు ప్రాంతాల కంటే తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితిలను అధిగమించేందుకు ఇల్లినాయిస్, మిచిగాన్, విస్కాన్సిస్ తదితర రాష్ట్రాల్లో అత్యవసర చర్యలు చేపట్టారు. సాధ్యమైనంత వరకు ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే కేవలం కొద్ది నిమిషాల్లోనే ఫ్రాస్ట్ బైట్‌కు గురై ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశముందని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది. ప్రజల రక్షణకు దాదాపు పలుచోట్ల వార్మింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇల్లినాయిస్‌లో గడ్డకట్టిన సరస్సు

ఇల్లినాయిస్‌లో గడ్డకట్టిన సరస్సు

చలి నుంచి బయటపడేందుకు మినియాపోలీస్‌లో ప్రజలను పబ్లిక్ బస్సులు, రైళ్లలో ఉండేందుకు అనుమతిస్తున్నారు. వాషింగ్టన్‌లో కోల్డ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.దీంతో ఇళ్లు లేని వారి కోసం అదనపు సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న గాలుల కారణంగా కనీవినీ ఎరుగని విధంగా అమెరికా గడ్డకట్టుకుపోయిది. ఇల్లనాయిస్‌లోని మిషిగన్ సరస్సులో నీరు గడ్డకట్టింది.

ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం

ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రభావం

ఆర్కిటిక్ గాలుల కారణంగా 2300కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ ప్రభావం ఎక్కువగా ఇల్లినాయిస్, మిషిగాన్, విస్కాన్సిన్, చికాగో, డెట్రాయిట్‌లో కనిపించింది. మొదటి మూడు రాష్ట్రాల్లో అత్యయిక స్థితి విధించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అత్యవసర లివింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, విద్యా సంస్థలకు, ఉద్యోగులకుసెలవులు, రైళ్ల రాకపోకలకు వీలుగా పట్టాలపై మంటలు ఏర్పాటు చేశారు.

కెనడాలోను ఇదే పరిస్థితి

కెనడాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. వెస్ట్రన్ ప్రయరీస్ ప్రాంతంలోని మనితోబా నుంచి అట్లాంటిక్ సీబోర్డు వరకు తీవ్రమైన శీతల పరిస్థితుల ప్రభావం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఒట్టావా విమానాశ్రయంలో రికార్డ్ స్థాయిలో మంచు కురిసింది. పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. బ్రిటన్‌లోను పలుచోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయాయి. పలు నగరాల్లో విమానాశ్రయాలు మూసివేశారు.

English summary
millions of people across the United States are experiencing a blast of cold weather that has already claimed at least six lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X