వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ ప్రియుడు: మెల్ బోర్న్ లో భర్తను చంపేసింది

|
Google Oneindia TeluguNews

మెల్ బోర్న్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి చివరికి అతను అనారోగ్యంతో చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించిన మహిళను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రియుడిని జైలుకు పంపించారు.

కేరళలోని కొల్లాం జిల్లాలోని కరువలూర్ కు చెందిన సోఫియా (30), ఆమె ప్రియుడు అరుణ్ కమలాసనన్ (32)లను మెల్ బోర్న్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు అధికారుల కథనం మేరకు కరువలూర్ కు చెందిన శామ్ అబ్రహాం (34), సోఫియా చిన్నప్పటి నుంచి స్నేహితులు.

ఇద్దరూ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివారు. 2008లో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ సందర్బంలో శామ్ తండ్రి అబ్రహాం అభ్యంతరం చెప్పారు. తరువాత సోఫియా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో అబ్రహాం వారి పెళ్లి జరిపించారు.

ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా తిరువనంతపురం, బెంగళూరులో ఉద్యోగం చేశారు. సోఫియా అక్క సోనియా మెల్ బోర్న్ లో ఉద్యోగం చేస్తున్నారు. సోనియా సహాయంతో సోఫియా మెల్ బోర్న్ వెళ్లిపోయి ఒమన్ లోని మనీ ఎక్సైంజ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది.

 Police allege Melbourne Kerala Sam Abraham was poisoned by Wife

2008 నుంచి మేల్ బోర్న్ లో సోఫియా కాలేజ్ స్నేహితుడు అరుణ్ కమలాసనన్ ఉంటున్నాడు. ఇద్దరూ కలుసుకున్నారు. అరుణ్ కమలాసనన్ కు వివాహాం అయ్యింది. భార్య, కుమారుడు ఉన్నారు.

సోఫియా, కమలాసనన్ కలిసన తరువాత అక్రమ సంబంధం కొనసాగించారు. 2013లో సోఫియా భర్త శామ్ మేల్ బోర్న్ వెళ్లాడు. 2015 జులై నెలలో మెల్ బోర్న్ రైల్వే స్టేషన్ దగ్గర శ్యామ్ మీద దాడి జరిగింది. అప్పుడు మెల్ బోర్న్ పోలీసులు కేసు నమోదు చేశారు.

2015 అక్టోబర్ లో శామ్ కేరళలోని అతని ఇంటికి వెళ్లాడు. తన మీద దాడి చేశారని, తాను ఎక్కువ కాలం బ్రతకను అని తండ్రి అబ్రహాంకు చెప్పాడు. కుటుంబ సభ్యులు అతనికి ధైర్యం చెప్పారు. కొంత కాలం కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న శామ్ తరువాత మెల్ బోర్న్ వెళ్లిపోయాడు.

చివరికి సోఫియా, సోనియా శామ్ శవాన్ని తీసుకుని కేరళ వచ్చారు. నిద్రలో గుండెపోటు రావడంతో శామ్ మరణించాడని చెప్పి కుటుంబ సభ్యులను నమ్మించారు. అంత్యక్రియలు పూర్తి చేసిన కొద్ది రోజులకే అందరూ మెల్ బోర్న్ వెళ్లిపోయారు.

ప్రతి వారం మామ (శామ్ తండ్రి) అబ్రహాంకు ఫోన్ చేసి అప్యాయంగా మాట్లాడుతున్న సోఫియా మీద వారికి అనుమానం రాలేదు. అయితే శామ్ మీద దాడి చేసిన కేసు నమోదు చేసిన పోలీసులకు అనుమానం వచ్చింది.

సోఫియా, అరుణ్ కమలాసనన్ మొబైల్ ఫోన్ సంభాషణలు రహస్యంగా విన్నారు. మూడు నెలల పాటు ఇద్దరి మొబైల్స్ ట్రాప్ చెయ్యడంతో వారి అక్రమ సంబంధం బయటపడింది. ఇద్దరిని అరెస్టు చేసి కేరళలోని శ్యామ్ తండ్రి అబ్రహాంకు సమాచారం ఇచ్చారు.

2017 ఫిబ్రవరి వరకు సోఫియా, అరుణ్ కమలాసనన్ కు రిమాండ్ విధిస్తూ మెల్ బోర్న్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సోఫియా, అరుణ్ కమలాసనన్ కు అక్రమ సంబంధం ఉందని తనకు తెలియదని శామ్ తండ్రి అబ్రహాం అంటున్నారు.

English summary
Sofia was working with a firm in Technopark and Sam at Lulu Exchange in Oman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X