• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వందలాది మంది అరెస్టు: అట్టుడుకుతోన్న పొరుగుదేశం: నో ఫేస్‌బుక్

|

రంగూన్: పొరుగు దేశం మియన్మార్‌ అట్టుడుకుతోంది. సైనిక పాలనకు నిరసనగా వేలాదిమింది రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. నిరసన ప్రదర్శనలపై నిషేధాన్ని విధించినప్పటికీ.. దాన్ని ధిక్కరిస్తున్నారు. వేలాదిమంది ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రదర్శనకారులను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు, సైనికులను మోహరింపజేసింది. జాతీయ భద్రతా బలగాలను రంగంలోకి దిపింది. నిరసనకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపించారు.
వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అక్కడి సమాచారం ఏదీ బయటికి పొక్కకుండా ఫేస్‌బుక్ వంటి కొన్ని సోషల్ మీడియా దిగ్గజ సంస్థలపై విధించిన నిషేధం కొనసాగుతోంది.

ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి..

ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి..


మియన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమం మొదలైంది. మియన్మార్‌లో మరోసారి సైనిక పాలన ఏర్పడిన విషయం తెలిసిందే. కిందటి నెల 31వ తేదీన తిరుగుబాటు చేపట్టిన సైన్యాధికారులు రాత్రికి రాత్రి అరెస్టులకు పాల్పడ్డారు. అంగ్‌సాన్ సూకీని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్‌డీ)కి చెందిన పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే కారణంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేశారు.

 ప్రజా ఉద్యమం..

ప్రజా ఉద్యమం..


దేశంలో సైనిక పాలన ఏర్పడటంతో ప్రజా ఉద్యమం ఆరంభమైంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలటూ వేలాదిమంది రోడ్డెక్కుతున్నారు. నిరసన ప్రదర్శలను చేపడుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అక్కడి సైనిక ప్రభుత్వం నిరసన ప్రదర్శనలను నిషేధించింది. అయినప్పటికీ.. ప్రజలు దాన్ని లెక్క చేయట్లేదు. ప్రజా ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని, అంగ్‌సాన్ సూకీని విడుదల చేయాలంటూ నినదిస్తున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతోన్న ఆందోళనలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రోజురోజుకూ వాటి తీవ్రత పెరుగుతుండటంతో సైనిక ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగింది.

 ప్రధాన నగరాల్లో

ప్రధాన నగరాల్లో


మాండలే, నెపిటా వంటి కొన్ని ప్రధాన నగరాల్లో బహిరంగ సభలపై నిషేధాన్ని విధించింది. రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి తీసుకొచ్చింది. ఎవరూ చట్టానికి అతీతులు కారని మిలటరీ అధ్యక్షుడు మిన్ ఆంగ్‌ హ్లయింగ్‌ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ టీవీ ఛానల్‌ ద్వారా ఆయన నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. అరెస్టుల పర్వం కొనసాగుతోన్నప్పటికీ.. నిరసనలు మాత్రం ఆగట్లేదు. మరింత తీవ్రంగా మారుతున్నాయి. నిర్బంధంలో ఉన్న తమ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ, ఎన్‌ఎల్‌డీ సీనియర్ నేతలను విడుదల చేయాలంటూడిమాండ్ చేస్తున్నారు.

 మళ్లీ సైనిక పాలన..

మళ్లీ సైనిక పాలన..

మియన్మార్ సుదీర్ఘ కాలం పాటు సైనిక పాలనలో కొనసాగింది. 2011 వరకూ ఆ దేశం సైనిక పాలనలోనే ఉండేది. అంగ్‌సాన్ సూకీ ఏళ్ల తరబడి గృహ నిర్బంధంలో గడిపారు. అనేక అంతర్జాతీయ ఒత్తిళ్ల తరువాత ఆమె విముక్తి పొందారు. 2015లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఆమె సారథ్యంలోని ఎన్ఎల్‌డీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయిదేళ్ల కాల వ్యవధి ముగియడంతో గత ఏడాది నవంబర్‌లో మరోసారి ఎన్నికలను నిర్వహించారు. వరుసగా రెండోసారి ఎన్ఎల్‌డీకి విజయం వరించింది. 2015 నాటి కంటే మెజారిటీ సీట్లను సాధించగలిగింది

English summary
Police cracked down on demonstrators opposing Myanmar’s military coup, firing warning shots and shooting water cannons to disperse crowds that took to the streets again Tuesday in defiance of rules making protests illegal. Water cannons were used in Mandalay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X