వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోస్టాఫీసులో కలకలం: ఖాతాదారులను నిర్బంధించిన యువకుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఓ పోస్టాఫీసు వెలుపల శుక్రవారం ఒక సాయుధ దుండగుడు ఇద్దరు వ్యక్తులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు తీవ్రవాద దాడులతో సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదని వారు చెప్పారు.

పోస్టీఫీసుకు వచ్చిన చాలా మంది ఖాతాదారులు ఆ ఆగంతకుడి నుంచి తప్పించుకోగలిగారని, పొందిక లేకుండా మాట్లాడుతున్న ఈ ఆగంతకుడి వద్ద పెద్ద మొత్తంలో గ్రెనేడ్లు, కలష్నికోవ్ తుపాకులు ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Police: Gunman briefly takes hostages in French post office

ప్యారిస్ వాయువ్య ప్రాంతంలోని కొలంబస్ పోస్టాఫీసు వద్ద అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, సమాచారం తెలిసిన వెంటనే హెలికాప్టర్‌తో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఇస్లామిక్ ఉగ్రవాదులు గత వారం వరుస దాడులు నిర్వహించి 17 మందిని ఊచకోత కోసిన ఘటన నుంచి ప్యారిస్ తేరుకోకముందే ఈ ఘటన జరగడం అక్కడ కలకలం సృష్టించింది. కొంతసేపటి వరకు అక్కడ ఉన్న ఖాతాదారులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

English summary
Paris (CNN)A man with a handgun entered a post office outside of Paris early Friday afternoon before reportedly surrendering and releasing his hostages unharmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X