వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యారిస్ దాడులు: ఉగ్రవాది పేరు మహమ్మద్ ఉగ్గద్

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: "మీ కుమారుడు ఇస్లామిక్ స్టేట్ స్థాపన కోసం యుద్దం చేసి అమరుడు అయ్యాడు. నీ కుమారుడు అమరవీరుడు" అంటూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో అంతం అయిన ఉగ్రవాది తల్లికి ఓ మెసేజ్ పంపించారు.

ప్యారిస్ దాడుల్లో పాల్గొన్న మూడో ఉగ్రవాది పేరు ఫాయెద్ మహమ్మద్ అగ్గద్ (23) అని ప్యారిస్ పోలీసు అధికారులు చెప్పారు. ఇతని తల్లి ఫ్రాన్స్ లోని స్ట్రాస్ బర్గ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నది. ఇటివల ఆమెకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఓ మెసేజ్ పంపించారు.

ప్యారిస్ లోని బాటక్లాన్ థియేటర్ వద్ద పోలీసులతో యుద్దం చేస్తున్న నీ కుమారుడు ఫాయెద్ మహమ్మద్ ఉగ్గద్ వీరమరణం పొందాడని, మీ కుటుంబ సభ్యులకు సానూభూతి తెలుపుతున్నామని ఉగ్రవాదులు మెసేజ్ పంపించారు.

Police identify third Bataclan in Paris attacks

వెంటనే ఆమె పోలీసు అధికారులను సంప్రదించారు. డీఎన్ఏ పరీక్షలకు సిద్దం అయ్యారు. బాటక్లాన్ థియేటర్ దగ్గర మారణహోమం సృష్టించిన ముగ్గురిలో మహమ్మద్ ఉగ్గద్ ఉన్నాడని డీఎన్ఏ పరీక్షలలో వెలుగు చూసిందని అధికారులు తెలిపారు.

అక్కడ భద్రతా దళాల చేతిలో అంతం అయిన ముగ్గురు ఉగ్రవాదులలో ఇప్పటికే ఇద్దరి వివరాలు సేకరించారు. అయితే మహమ్మద్ ఉగ్గద్ తల్లి ఇచ్చిన సమాచారంతో మరో ఉగ్రవాది పేరు వెలుగు చూసిందని ప్యారిస్ పోలీసు అధికారులు తెలిపారు.

బాటక్లాన్ థియేటర్ దగ్గర జరిగిన మారణహోంలో 80 మంది సంఘటనా స్థలంలో అంతం అయ్యారు. ప్యారిస్ దాడుల్లో మొత్తం 130 మంది మరణించారు. ప్యారిస్ దాడుల్లో పాల్గోన్న ఉగ్రవాదులు అందరూ దాదాపు యూరోపియన్ పౌరులే అని అధికారులు అంటున్నారు. మహమ్మద్ ఉగ్గద్ 2013లో సిరియా వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

English summary
Foued Mohamed Aggad went to Syria with his brother and a group of friends at the end of 2013, according to a source close to the investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X