వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"శృంగారంలోకి రా, లేదంటే అరెస్టు చేస్తా"

|
Google Oneindia TeluguNews

ఇంగ్లాండ్: శృంగారంలొ పాల్గొనాలని లేదంటే అరెస్టు చేస్తానని ఓ పోలీసు అధికారి వ్యాభిచారం చేస్తూ పట్టబడ్డ ఓ మహిళను బెదిరించి ఇలా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. చివరికి బాధితురాలిని తీసుకు వెళ్లి లైంగిక వాంఛ తీర్చుకుని జైలుపాలైనాడు.

బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు అధికారులు ఆ పోలీసు అధికారిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇంగ్లాండ్ పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వెస్ట్ డెర్బీ లోని ఈటన్ రోడ్డు పోలీస్ స్టేషన్ లో డేవిడ్ గిబ్బన్ (44) పోలీసు అధికారిగా పని చేస్తున్నారు.

2014 నంబర్ 6వ తేదిన ఈయన నైట్ డ్యూటీలో ఉన్నాడు. తరువాత స్టేషన్ లో ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా టూబ్రూక్ లోని షీల్ రోడ్ ఏరియాలోకి వెళ్లి అతని వాహనాన్ని పార్క్ చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వాహనం పార్క్ చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.

ఈ ప్రాంతానికి సెక్స్ వర్కర్లు ఎక్కువగా వస్తుంటారు. ఆ సమయంలో ఓ మహిళ అటు వెళుతూ గిబ్బన్ కంటపడింది. వెంటనే ఆమెను పిలిచాడు. జరిమానా కట్టాలని ఆమెను ఆదేశించాడు. తన దగ్గర డబ్బులు లేవని, తనను వదిలేస్తే ఇంకెప్పుడూ ఇటు వైపు రానని ఆమె వేడుకుంది.

నేను చాల మంచివాడిని, నిన్ను అరెస్టు చెయ్యను, జరిమానా కట్టమని చెప్పను, అయితే తనతో శృంగారంలొ పాల్గొనాలని గిబ్బన్ ఆమెకు చెప్పాడు. దుర్భల స్థితిలో ఉన్న ఆమెను గిబ్బన్ అతని వాహనంలోనే నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లాడు.

 Police man accused of forcing Prostitute to perfom sex act

తరువాత గిబ్బన్ తన కోరిక తీర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన బాధితురాలు పై అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు గిబ్బన్ మీద కేసు నమోదు చేశారు.

ఇద్దరికి వైద్య పరిక్షలు నిర్వహించారు. బాధితురాలితో గిబ్బన్ శృంగారంలొ పాల్గొన్నాడని వెలుగుచూసింది. పోలీసు యూనిఫాంలో ఉంటూ గిబ్బన్ తనపట్ల దారుణంగా వ్యవహరించాడని బాధితురాలు వెల్లడించింది.

లివర్ పూల్ క్రౌన్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోందని కోర్టు ప్రాసిక్యూటర్ మరియా మస్సెలిస్ తెలిపారు. డేవిడ్ గిబ్బన్ మీద గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని పై అధికారులు అంటున్నారు. ఇప్పటికే గిబ్బన్ ను అరెస్టు చేశారు.

English summary
A spokesman for the police watchdog, the Independent Police Complaints Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X