వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ అధికారిని ఫ్లోరిడా వీధుల్లో తరిమిన చిన్న పందిపిల్ల! ఎందుకంటే.. (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

పోలీస్ అధికారిని ఫ్లోరిడా వీధుల్లో తరిమిన చిన్న పందిపిల్ల! ఎందుకంటే.. (వీడియో)

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆసక్తిర సంఘటనకు సంబంధించిన వీడియోను కేప్ కోరల్ పోలీసు డిపార్టుమెంట్ పోస్టు చేసింది. ఇది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ చిన్న పందిపిల్లను చూసి ఓ పోలీసు అధికారి పరుగెత్తుకుంటూ వెళ్తాడు.

ఆయన పరుగెత్తింది పందిపిల్లకు భయపడి కాదు. దానిని యజమాని వద్దకు చేర్చడానికి. ఈ సంఘటన ఆగస్ట్ 26వ తేదీన దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటలకు చోటు చేసుకుందని పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్లో వీడియోను పోస్ట్ చేసారు.

ఫ్లోరిడా వీధుల్లో పందిపిల్ల

ఫ్లోరిడా వీధుల్లో పందిపిల్ల

చిన్న పందిపిల్ల వెంటపడటంతో సదరు పోలీసు అధికారి పరుగెత్తుకుంటూ జనాలు ఉండేచోటుకు వెళ్లాడు. ఈ పందిపిల్లను యజమాని వద్దకు చేర్చే ప్రయత్నం చేశాడు.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కేప్ కోరల్‌లో విల్లీ అనే ఓ పెంపుడు పంది పిల్ల తిరుగుతున్నట్లు ఆగస్టు 26న పోలీసులకు సమాచారం అందింది.

పోలీసు అధికారిని వెంబడించిన పందిపిల్ల

పోలీసు అధికారిని వెంబడించిన పందిపిల్ల

దీంతో రే సిల్కే అనే పోలీస్ అధికారి అక్కడకు చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో రేనే తన యజమానిగా భావించిన పందిపిల్ల అధికారి దగ్గరకు వచ్చింది. దీంతో సమీపంలో కొంతమంది స్థానికులు ఉండటాన్ని గమనించిన రే.... అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.

సెల్ఫీ వీడియో తీసుకున్న అధికారి

సెల్ఫీ వీడియో తీసుకున్న అధికారి

అతనిని వెంబడిస్తూ.. ఆ పందిపిల్ల కూడా పరుగెత్తింది. ఈ మొత్తాన్ని సదరు పోలీసు అధికారి స్వయంగా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రోడ్డు పక్కన ఉన్న ఓ జంట ఇతనిని చూసి నవ్వుతుంది.

తనపై తానే జోక్

దీనిపై సదరు పోలీసు అధికారి స్పందిస్తూ... పందిని పందిపిల్ల తరమడం ఎప్పుడూ చూడలేదా? అని తనపై తానే జోక్ వేసుకున్నాడు. అక్కడ చిన్నారులు ఉండటంతో ఈ జంతువు ఎవరిదో మీకు తెలుసా? అని అడిగాడు. అతను తీసిన సెల్ఫీ వీడియోను పోలీసులు పోస్ట్ చేసారు. అతని తీరుపై, సెన్సాప్ హ్యూమర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

English summary
A Florida police officer responding to a loose animal complaint posted a video of the animal in question a tiny pig chasing him down the street.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X