వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్భిణీని కత్తితో పొడిచి కడుపులో ఉన్న బిడ్డను ఎత్తుకెళ్లారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: నిండు గర్భిణిని కత్తితో పొడిచి ఆమె కడుపులోని బేబిని ఎత్తుకెళ్లిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొలరాడాలోని లాంగ్‌మోంట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 26ఏళ్ల మహిళ బుధవారం మధ్యాహ్నాం ఒక్కసారిగా సాయం చేయండంటూ గట్టిగా కేకలు వేసింది.

ఆ ఇంటికి సమీపంలో ఉన్న పోలీసులు అటుగా వెళ్లి చూడగా ఆమె కడుపులో కత్తితో పొడిచిన గాయాలతో పడి ఉందని లాంగ్‌మోంట్ పోలీస్ స్టేషన్ కమాండర్ జెఫ్ సాటుర్ తెలిపారు. ఏం జరిగిందని ఆ మహిళను ప్రశ్నించగా, తనపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడని, కడుపులో పొడిచి తన బిడ్డను తీసుకొని వెళ్లాడని ఆమె వెల్లడించదన్నారు.

Police: Pregnant woman's baby cut from womb when she answers Craigslist ad

వస్త్ర వ్యాపారిలా ఒక వ్యక్తి తన ఇంటికి రావడంతో పుట్టబోయే తన బిడ్డకు మంచి బట్టలు చూపించండంటూ మాట్లాడుతుండగా ఆ వ్యక్తి కత్తితో దాడి చేసి కడుపులో ఉన్న బిడ్డను ఎత్తుకెళ్లినట్లు తెలిపిందని పోలీసులు తెలిపారు. దీంతో హుటాహుటిన ఆ మహిళను లాంగ్‌మోంట్ యునైటెడ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్ధితి విషమంగా ఉంది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ కోలుకోవాలంటే, సర్జరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో సదరు మహిళ చికిత్స పొందుతున్న సమయంలో 34 ఏళ్ల వ్యక్తి ఒక బేబీని చేతిలో పట్టుకొని వచ్చాడు.

అయితే ఆ బేబీని వేరే మహిళకు గర్భస్రావం అవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని ఇంటిని డిటెక్టివ్‌లు వెతికే పనిలో పడ్డారు. నిందితుడిపై హత్య, దాడి తదితర సెక్షన్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A stranger stabbed a pregnant woman and cut her baby from her womb when the victim answered a Craigslist ad in Colorado, authorities said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X