వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగ్జరీ స్పోర్ట్స్ కారు కోసం రాజపక్స ఇంట్లో సోదాలు, వేధింపులని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసు అధికార ప్రతినిధి అజిత్ రొహన మాట్లాడుతూ.. న్యాయస్థానం వారెంట్‌తో తాము సోదాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదర్న్ ప్రావిన్స్‌లో రాజపక్స కంట్రీహోం ఉంది.

ఆ ఇంటిలో లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కోసం పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే, ఆ సెర్చ్‌లో వారికి ఎలాంటివి దొరకలేదని తెలుస్తోంది.

 Police raids former Sri Lankan president Mahinda Rajapaksa's country home

తంగళ్లెలోని తమ ఇంటిలో సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించారని, లాంబోర్గిని కార్ల కోసం ఈ సోదాలు నిర్వహించారని మహింద రాజపక్స తనయుడు నమల్ రాజపక్స తెలిపారు. కేవలం తమ ఇళ్లలో మాత్రమే కాకుండా, తమ స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ వేధిస్తున్నారని నమన్ అన్నారు.

పోలీసులకు తమ పైన తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. తమ వద్ద సీ ప్లేన్స్, టైర్స్, రేసింగ్ కార్లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. అయితే, తమ వద్ద వారికి కేవలం చిన్నపిల్లలు ఆడుకునే పెడల్ బోట్స్ మాత్రమే లభించాయన్నారు. రాజపక్సకు సంబంధించిన స్పోర్ట్స్ కార్లను కనుగొనేందుకు పోలీసులు సోదాలు నిర్వహించారు.

English summary
Embattled former Sri Lankan president Mahinda Rajapaksa's country home in the southern province has been raided by police who were looking for a luxury sports car but the search drew a blank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X