వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులకే మస్కా కొట్టి దొరికిపోయిన కవలలు

|
Google Oneindia TeluguNews

మాస్కో: ఆ ఇద్దరు కవలలు ఒకేలా ఉంటారు. దీన్నే ఆసరాగా చేసుకుని తమ పని కానిద్దామని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు వారి ఆలోచన బెడసికొట్టి జైలుపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన రష్యాలోని మాస్కోలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. యారోస్లావ్, ఓలెగ్‌(20)లు మాస్కోకు చెందిన కవల అన్నదమ్ములు. అయితే, పెద్దవాడైన యారోస్లావ్‌ మాస్కోలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఓ రోజు యారోస్లావ్‌ ఏదో పని ఉండి విధులకు వెళ్లలేకపోయాడు.

అప్పుడే యారోస్లావ్‌కి తన స్థానంలో తమ్ముడు ఓలెగ్‌ స్పీవక్‌ని పంపాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా తన తమ్ముడిని తన విధుల్లోకి పంపించాడు.

Policeman sent his lookalike brother to cover his shifts for him for a YEAR

దాదాపు ఏడాది వరకు అక్కడి పోలీసులు కూడా ఎవరు అసలైన పోలీసో తెలుసుకోలేకపోయారు. అయితే, ఓసారి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఓ కేసు విషయమై ఓలేగ్‌తో మాట్లాడాడు. ఆ అధికారి ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడో ఓలేగ్‌కి అర్ధం కాకపోవడంతో.. విధిలేని పరిస్థితుల్లో దొరికిపోయాడు.

దీనిపై విచారణ చేపట్టగా తన అన్న డ్యూటీలో లేనప్పుడు తాను వస్తుంటానని నిజం ఒప్పుకున్నాడు. తన అన్నే విధుల్లో ఎలా ఉండాలో కూడా నేర్పించాడని చెప్పాడు. దీంతో పోలీసులనే మోసం చేయాలని చూసిన యారోస్లావ్‌ని ఉద్యోగంలోంచి తొలంగించి అరెస్ట్ చేశారు.

English summary
A Russian police guard came up with a 'foolproof' way of skipping out of work - by getting his lookalike brother to cover his shifts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X