వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న కొట్టాడు.. ఇవాళ ముద్దు పెట్టాడు.. బుగ్గలు కొరకొద్దంటూ కిరికిరి చేశాడు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

మొన్న కొట్టాడు.. ఇవాళ ముద్దు పెట్టాడు.. బుగ్గలు కొరకొద్దంటూ కిరికిరి చేశాడు..!!

పిల్లకు ప్రేమతో పెట్టే ముద్దు వారికి పదింతల బలమిస్తుందంటారు. అందుకే అమ్మానాన్నలు మనల్ని బాగా ముద్దు చేస్తుంటారు. తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువ గౌరవించేది దేవుణ్ని. క్యాథలిక్ చర్చికి సంబంధించి దేవుడి తర్వాత ఎక్కువ గౌరవం లభించేది మతాధికారి పోప్‌కే. ఆయనను చూడటానికే నిత్యం లక్షల మంది వాటికన్ సిటీకి వెళుతుంటారు. అలాంటిది పోప్ ను తాకడం.. ముద్దు ద్వారా ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడాన్ని చాలా గొప్ప విషయంగా భక్తులు భావిస్తుంటారు. ఓ క్రైస్తవ సన్యాసిని ముద్దుకోరగా.. అందుకు పోప్ ఇచ్చిన సమాధానం తాలూకు వార్తలు ప్రపంచవ్యాప్తంగా వైరలయ్యాయి.

బాపియో.. పాపా

బాపియో.. పాపా

పోప్ ఫ్రాన్సిస్ ప్రతి బుధవారం వాటికన్ సిటీలో సాధారణ ప్రజల్ని కలుస్తుంటారు. వరుసగా నిలబడ్డ బృందాల్ని పలకరించుకుంటూ పోప్ ముందుకెళుతుండగా.. ఒక నన్ సడెన్ గా ‘‘బాపియో పాపా(ఇటాలియన్ భాషలో పోప్‌గారూ ఒక ముద్దు''అని అభ్యర్థించింది. అందుకు పోప్ ఠక్కున రియాక్టవుతూ..‘‘నువ్వు కామ్ గా ఉంటేనే ముద్దుపెడతాను..కానీ నన్ను కొరకొద్దు ప్లీజ్..'' అని జోక్ చేయడంతో హాలు మొత్తం ఘొల్లుమంది. చివరికి నన్ కోరినట్లే పోప్ ఆమెను ముద్దుతో ఆశీర్వదించి ముందుకు కదిలారు.

వారం కిందటే వివాదం..

వారం కిందటే వివాదం..

ముద్దు సంఘటన జరగడానికి సరిగ్గా వారం రోజుల ముదు పోప్ ఓ మహిళను కొట్టడం పెనుదుమారానికి దారితీసింది. న్యూఇయర్ వేడుకల సందర్భంగా వాటికన్ సిటీకి వచ్చిన జనాన్ని పలకరిస్తూ వెళుతుండగా.. ఓ మహిళ పోప్ చెయ్యిపట్టుకుని తనవైపుకు లాగేసుకుంది. ఈ చర్యతో బిత్తరపోయిన పోప్.. రెండో చేత్తో ఆమె చేతిమీద చురకలు వేశారు. కొద్దిగంటలకే తప్పు తెలుసుకున్న ఆయన.. క్షమంచాలంటూ ఆ మహిళను వేడుకున్నారు. ‘‘మహిళ చేతిపై చరచడం ద్వారా నేనొక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అది చాలా తప్పు. ఐయామ్ వెరీ సారీ''అని వివరణ ఇచ్చారు.

దటీజ్ పోప్ ఫ్రాన్సిస్

దటీజ్ పోప్ ఫ్రాన్సిస్

ఇప్పటిదాకా పోప్ ఆ పదవి చేపట్టినవాళ్లలో చాలా మంది తాము చాలా స్పెషల్ గా ఫీలయ్యేవాళ్లు. ప్రజలతో అంటీముట్టనట్టు వ్యవహరించేవాళ్లు. కానీ ఇప్పుడున్న పోప్ ఫ్రాన్సిస్ తీరేవేరు. అర్జెంటీనా జాతీయుడైన ఆయన.. కరడుగట్టిన యూరోపియన్ కన్జర్వేటివ్ విధానాలకు వ్యతిరేకి. సాధారణ పౌరుల్ని సైతం ఆలింగనం చేసుకుంటూ అందరితో కలిసిపోయే రకం. రోమన్ క్యాథలిక్ చరిత్రలో పోప్ గ్రెగోరీ-3 తర్వాత 1300 ఏండ్లకుగానీ పోప్ పీఠమెక్కిన తొలి నాన్ యూరోపియన్‌గానూ రికార్డు నెలకొల్పాడు. ఇన్ని స్పెషాలిటీలు ఉన్నాయి కాబట్టే పోప్ ఫ్రాన్సిస్ పదే పదే వార్తల్లో నిలుస్తారు.

English summary
Pope Francis, who last month angrily slapped the hand of a woman who yanked him towards her, gave a light-hearted reply to a nun who asked him for a kiss on Wednesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X