వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక బాంబు పేలుళ్లపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్

|
Google Oneindia TeluguNews

వాటికన్ సిటీ: మానవాళికి శాంతిని బోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతారని భావించే ఈస్టర్ సండే నాడు శ్రీలంకను అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై ప్రపంచం మొత్తం షాక్ కు గురైంది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఈ ఆత్మాహూతి దాడులను ముక్తకంఠంతో ఖండించాయి. హింసకు తావు లేదని స్పష్టం చేశాయి. క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ మారణకాండను సృష్టించడం పట్ల పోప్ ఫ్రాన్సిస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీలంకలోని క్రైస్తవులకు పోప్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

ఆత్మాహూతి దాడి టార్గెట్ లో భారత రాయబార కార్యాలయం: భద్రత కట్టుదిట్టంఆత్మాహూతి దాడి టార్గెట్ లో భారత రాయబార కార్యాలయం: భద్రత కట్టుదిట్టం

ఈస్టర్ సండేను పురస్కరించుకుని ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోప్ ఫ్రాన్సిస్ హాజరయ్యారు. ఈస్టర్ సండే నాడు సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్.. శాంతిబోధనలను చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదివారం కూడా ఆయన సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ప్రపంచ మానవాళిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో శ్రీలంకలో చోటు చేసుకున్న మారణహోమాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని బోధించే ప్రబోధించే ప్రార్థనా స్థలాలపై దాడులు చేయడం శ్రేయస్కరం కాదని అన్నారు.

Pope Francis laments Easter Sunday attacks in Sri Lanka

ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పోప్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ఆయన క్రూరమైన హింసగా అభివర్ణించారు. శ్రీలంకలోని క్రైస్తవులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పోప్ చెప్పారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. క్రూరమైన హింస బారిన పడ్డ ప్రజలందరూ త్వరలోనే కోలుకుని, సాధారణ జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నానని చెప్పారు.

English summary
Pope Francis laments the Easter Sunday attacks on several churches and hotels in Sri Lanka, which killed at least 138 people and wounded more than 400 others. “‘I wish to express my heartfelt closeness to the Christian community [of Sri Lanka], wounded as it was gathered in prayer, and to all the victims of such cruel violence.”‘ Pope Francis spoke those words of solidarity at the conclusion of his Easter Urbi et Orbi address to the faithful in St. Peter’s Square.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X